Major Review: `మేజర్` మూవీ రివ్యూ.. రేటింగ్
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తాజాగా తెలుగు, హిందీలో పాన్ ఇండియా రేంజ్‌లో `మేజర్` అనే సినిమాని రూపొందించారు. `మేజర్` సినిమాఈ చిత్రం జూన్ 3(శుక్రవారం) విడుదలవుతుంది. సినిమా ఎలా ఉందనేది `మేజర్` రివ్యూలో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
26/11ముంబయి దాడులు భారత దేశాన్ని ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. భారతీయ టెర్రరిస్ట్ ఎటాక్‌లోనే ఇది అత్యంత భారీ దాడులు. ఈ దాడుల ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లష్కర్ ఈ తైయిబా సంస్థకి చెందిన పది మంది టెర్రరిస్ట్ లు ముంబయిలో తాజ్ హోటల్‌తోపాటు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ ఘటనలో 175 మంది అతిథులు, సాధారణ ప్రజలు మరణించగా, 300లకుపైగా గాయపడ్డారు. 9మంది టెర్రరిస్ట్ లను పోలీసులు(ఎన్‌ఎస్‌జీ కమాండోలు) మట్టుపెట్టారు. కసబ్ అనే టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకున్న విసయం తెలిసిందే. ఈ ఘటనలో మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (Mojar Sandeep Unnikrishnan) వీరమరణం పొందారు.
ఈ ఘటన ఆధారంగా చేసుకుని, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తాజాగా తెలుగు, హిందీలో పాన్ ఇండియా రేంజ్‌లో `మేజర్` అనే సినిమాని రూపొందించారు. సందీప్ ఉన్నికృష్ణన్‌గా అడివి శేష్ నటించగా, `గూఢచారి` ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేష్ బాబుకు చెందిన ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మహేష్ నిర్మాణంలో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ అటెన్షన్ నెలకొంది. మరోవైపు సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడంతో దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. `మేజర్` సినిమాఈ చిత్రం జూన్ 3(శుక్రవారం) విడుదలవుతుంది. అయితే సినిమాపై నమ్మకంతో ముందుగానే సినిమాని ఆడియెన్స్ కి చూపించారు. మే 24 నుంచే ఈ చిత్రాన్ని దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ముందుస్తుగానే ప్రదర్శిస్తున్నారు. చివరగా జూన్ 2(నేడు-గురువారం) సాయంత్రం హైదరాబాద్‌లో సెలబ్రిటీలకు, ఆడియెన్స్ కి స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందనేది `మేజర్` రివ్యూలో (Major Movie Review) తెలుసుకుందాం.
`మేజర్` కథః
26/11 ముంబయి దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఉన్నికృష్ణన్ చిన్ననాటి నుంచి ఆయన లైఫ్‌ని చూపించారు. ఆయన పెరిగిన తీరుని, ప్రేమని, సైనికుడిగా మారిన విధానం, పోరాటాన్ని చూపించారు. చిన్నప్పట్నుంచి ఉన్నికృష్ణన్(అడవిశేష్) తను అనుకున్నది చేయాలనుకునే వ్యక్తి. చిన్నప్పుడు తండ్రి(ప్రకాష్‌రాజ్)తో కలిసి ఏవియేషన్, నేవి ఎగ్జిబిషన్‌కి వెళ్లేవారు. అక్కడ నేవీ అధికారుల యూనిఫామ్, వారికి దక్కే గౌరవాన్ని చూసి ముగ్దుడవుతాడు. తను కూడా నేవీ అధికారి కావాలనుకుంటాడు. కానీ తండ్రికేమో డాక్టర్ కావాలని ఉంటుంది. తండ్రి కోరికని పక్కన పెట్టి తనకు కావాలనుకున్నది చేయాలనుకుంటాడు. నేవీకి అప్లికేషన్ పెట్టుకోగా, రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఆర్మీ ట్రైనింగ్‌లో సందీప్ అన్నింటిలోనూ ముందుంటాడు. తనకున్న టాలెంట్‌తో ఎన్‌ఎస్‌జీ కమాండో ట్రైనర్ గా ఎదుగుతాడు. ఎంతో మంది కమాండోలను తయారు చేస్తుంటాడు. ఎన్‌ఎస్‌జీలోనే సందీప్ ట్రైన్ చేసే టీమ్ నెంబర్ వన్ పొజీషియన్‌లో ఉంటుంది. ఆ స్థాయిలో ఉన్న సందీప్ ముంబయి దాడుల ఆపరేషన్‌లో పాల్గొనేందుకు దారితీసిన పరిణామాలేంటి? ఆయన జీవితంలో ప్రేమకి ఉన్న స్థానమేంటి? ఫ్యామిలీ లైఫ్, కెరీర్ రెండింటిలో మేజర్ సందీప్ దేనికి ప్రయారిటీ ఇచ్చాడు. తాజ్ హోటల్‌లో జరిగిన ఆపరేషన్‌లో సందీప్ ఏవిధంగా పోరాడాడనేది మిగిలిన సినిమా. Major Movie Review
విశ్లేషణః
దేశభక్తి సినిమాలు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ఇన్స్పైరింగ్‌గా ఉంటాయి. దేశభక్తిని చాటుతుంటాయి. ఇలాంటి చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించాలంటే మేకర్స్ కి కత్తిమీద సాము లాంటి. పర్‌ఫెక్ట్ మీటర్‌లో చేయాలి. కమర్షియల్ అంశాలను జోడిస్తే, అసలు కథ పక్కకెళ్తుంది. అలాగని, జీవితంలోని సన్నివేశాలే ప్రధానంగా చేస్తే అదొక డాక్యుమెంటరీ అవుతుంది. ఈ రెండూ కాకుండా ఓ అద్భుతమైన సినిమాగా మల్చాడమే దర్శకుడి ముందున్న సవాల్. ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి. నటీనటులు ఎంపిక, వారి నటన, కాస్ట్యూమ్స్,మ్యూజిక్, ఆర్ట్ వర్క్, టెక్నికల్ అంశాలు ఇలా అన్నింటిని పర్‌ఫెక్ట్ గా చూసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలపాలు కాక తప్పదు.
`మేజర్` విషయంలో చిత్ర బృందం మాత్రం పర్‌ఫెక్ట్ మీటర్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. సినిమా మొదటి భాగం మొత్తం సందీప్ ఉన్నికృష్ణన్ చైల్డ్ నుంచి మేజర్‌గా ఎదిగిన తీరుని చూపించారు. ఈ క్రమంలో ఆయన ప్రేమ కథని హైలైట్ చేశారు. మేజర్ తల్లి(రేవతి), తండ్రి(ప్రకాష్‌రాజ్)లతో ఉన్న అనుబంధాన్ని, ప్రియురాలు(సాయీమంజ్రేకర్)తో లవ్ స్టోరీని చూపించారు. దీంతోపాటు ఆర్మీ అధికారిగా ట్రైనింగ్ కావడం, చివరికి మేజర్‌గా ఎదిగిన తీరు వరకు చూపించారు. ఇందులో కొన్ని లవ్ ఎపిసోడ్స్ తప్ప అంతగా కనెక్ట్ అయ్యే అంశాలేవి లేవు. తల్లి రేవతి, అడివి శేషు, తండ్రి ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సన్నివేశాలతో అసలు కథ స్టార్ట్ అవుతుంది.
ఇంటర్వెల్ తర్వాత తాజ్ హోటల్‌లో ఆపరేషన్ కోసం ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం అయిన అడివి శేష్ టీమ్ రంగంలోకి దిగుతుంది. తాజ్ హోటల్‌లోకి ప్రవేశించి నాలుగు రోజులపాటు టెర్రరిస్ట్ లతో పోరాడిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఇందులో మేజర్ సందీప్ నిర్ణయాలు, ఆయన చేసే యాక్షన్ హైలైట్‌గా ఉంటుంది. శేష్ పాత్ర చుట్టూతే సన్నివేశాలు తిరుగుతుంటాయి. మధ్య మధ్యలో తన భార్య సాయీ మంజ్రేకర్ సీన్లు, తల్లిదండ్రులు టెన్షన్ పడే సీన్లు చూపించి యాక్షన్ ఎపిసోడ్ల నుంచి రిలీఫ్‌ని కలిగిస్తుంటారు. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఇంటెన్సిటీతో రన్ అవుతుంది. Major Movie Review
అయితే టెర్రరిస్ట్ లను మట్టుపెట్టే ఆపరేషన్ ప్రధానంగానే ద్వితీయార్థం సాగుతున్న నేపథ్యంలో మధ్య మధ్యలో వచ్చే ఇతర సన్నివేశాలు ఆ ఇంటెన్సిటీని దెబ్బతీస్తుంటాయి. అదే సమయంలో యాక్షన్ ఎపిసోడ్స్ లో నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా ఉండాలి. ఆ ఉత్కంఠత మిస్ అవుతుంది. ఆయా సన్నివేశాలు రెగ్యూలర్‌గానే సాగుతుంటాయి. రియల్ స్టోరీ కావడంతో క్రియేటివి పరంగా లిబర్టీకి స్కోప్ లేకపోవడంతో దర్శకుడు అక్కడక్కడే నడిపించారు. ఆయా సన్నివేశాలు కాస్త బోరింగ్‌గానూ అనిపిస్తుంటాయి. కానీ ఆ బోర్ ఫీలింగ్ ఎక్కువ లేకుండా యాక్షన్ సీన్లు, అందులోనే కొన్ని సెంటిమెంట్ సీన్లు, శోభితా దూళిపాళ్ల, ఓ చిన్నారిని కాపాడే సీన్లు జోడించి రిలీఫ్ కోసం ప్రయత్నం చేశారు.
మరోవైపు సినిమా మొత్తం అడివి శేష్ పాత్ర చుట్టూనే సాగుతుండటంతో ఆయన నటనలో, పాత్రలో కొంత సహజత్వం మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. శేష్‌ని ఎలివేట్ చేసే క్రమంలో ఇంట్రెన్సిటీ మిస్ అవుతుంది. చివరల్లో సందీప్ పోరాడిన తీరు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో తన కుమారుడి గురించి తండ్రి(ప్రకాష్‌రాజ్) చెప్పే ఎమోషనల్ డైలాగ్‌లు గూస్‌బంమ్స్ ని తెప్పిస్తాయి. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగడంతో ఆడియెన్స్ ఆ మూడ్‌లో ఉండిపోతారు. భావోద్వేగ హృదయంతో బయటకు వస్తారు. కొన్ని కొన్ని మిస్టేక్స్,లాగ్, ఫస్టాఫ్‌లోని ఎక్స్ ట్రా సీన్లు బోరింగ్‌గా అనిపించినా ఓవరాల్‌గా మంచి ఇన్‌స్పైరింగ్ మూవీ అని చెప్పొచ్చు. Major Movie Review
ఆర్టిస్టుల నటనః
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ పరకాయ ప్రవేశం చేశాడు. లవర్ బాయ్‌గా, మేజర్‌గా తన మార్క్ నటనని ప్రదర్శించి వాహ్ అనిపించాడు. ఇక తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. కథని నడిపించడంలో ఆయన పాత్ర చాలా కీలకం. క్లైమాక్స్ లో ఆయన చెప్పేడైలాగులు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. తల్లిగా రేవతి కట్టిపడేశారు. ప్రియురాలిగా సాయీ మంజ్రేకర్ బాగా చేసింది. వర్షంలో బస్‌పై ఎక్కి ముద్దుపెట్టే సీన్‌లో అటు శేష్, సాయీ రెచ్చిపోయారు. అతిథిగా శోభితా ధూళిపాళ్ల మెప్పించింది. మురళీ శర్మ తన పాత్రకి న్యాయం చేశారు.
టెక్నీషియన్ల పనితీరుః
పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. బీజీఎం విషయంలో ఇంకాస్త ఫోకస్ పెడితే బాగుండేది. అబ్బూరి రవి డైలాగ్‌లు బాగున్నాయి. భారీ డైలాగ్‌లు లేకుండా సింపుల్‌గానే చెప్పినా ఎమోషనల్‌గా అనిపించాయి. నిర్మాణ విలువలు హైలైట్. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఆర్ట్ వర్క్ సినిమాకి హైలైట్. ఎక్కడా ఆర్టిఫీషియల్ ఫీలింగ్ కలగదు. సహజత్వం ఉట్టిపడేలా సెట్స్, గన్స్ ఉండటం విశేషం. కాస్ట్యూమ్స్ తో సహ మైన్యూర్ డిటేయిల్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నారు. ఆ విషయంలో టీమ్‌ని అభినందించాల్సిందే. టీమ్ హార్డ్ వర్క్ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. దర్శకుడు శశికిరణ్ తిక్క సినిమా కోసం పడ్డ కష్టం కనిపిస్తుంది. బయోపిక్‌ని కాబట్టి ఆయన ప్రతి డిటెయిల్స్ విషయంలోనూ కేర్ తీసుకున్నారు. చిన్ననాటి విషయాలు,లవ్ స్టోరీ మీద కాకుండా యాక్షన్ సీన్లు, ఆపరేషన్ సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే, వాటిని ఇంకాస్త ఇంటెన్సిటీతో, ఎమోషనల్ డ్రైవ్‌తో తీసుకెళ్లి ఉంటే సినిమా ఫలితం ఇంకో రేంజ్‌లో ఉండేదని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః ఇలాంటి దేశభక్తి సినిమాలు, సైనికుల జీవితాల ఆధారంగా తీసే సినిమాలు క్రిటికల్‌గా ప్రశంసలందుకుంటాయి. కానీ కమర్షియల్‌గా బాక్సాఫీసు వద్ద ఆదరణ దక్కడం తక్కువ. `మేజర్` దాన్ని ఏ మేరకు బ్రేక్ చేస్తుందనేది ప్రశ్న. Major Movie Review
రేటింగ్- 2.75