- Home
- Entertainment
- ఇలియానా టూ ఈషా, పాయల్ టూ లావణ్య, నివేతా, మెహరీన్.. ఆఫర్లు లేకపోయినా అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న భామలు
ఇలియానా టూ ఈషా, పాయల్ టూ లావణ్య, నివేతా, మెహరీన్.. ఆఫర్లు లేకపోయినా అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న భామలు
టాలీవుడ్ హాట్ ముద్దుగుమ్మలు వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నారు. అందాల ఆరబోతో పిచ్చెక్కిస్తున్నారు. కానీ చేతిలో ఆఫర్లు మాత్రం నిల్. మరి ఆ భామలెవరో ఓ లుక్కేద్దాం.

ప్రియాంక జవాల్కర్.. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జవాల్కర్ సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటూ టాలీవుడ్ హాట్ కేక్ అయ్యింది. `టాక్సీవాలా`, `తిమ్మరుసు`, `ఎస్ ఆర్ కళ్యాణమండపం`, `గమనం` చిత్రాల్లో మెరిసింది. హాట్ అందాలను చూపించడంలో రెచ్చిపోతుంది. కానీ ఇప్పుడీ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.
నివేతా పేతురాజ్.. హాట్ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది నివేతా పేతురాజు. యంగ్ హీరోతో లవ్ స్టోరీ నడిపిస్తున్న ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా `ధమ్కీ`ఉంది. కానీ సామాజిక మాధ్యమాల్లో గ్యాప్ లేకుండా సెక్సీ ఫోటో షూట్లు చేస్తూ హంట్ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. కొత్తగా ఈ అమ్మడి చేతిలో సినిమాలు లేకపోవడం గమనార్హం.
`ఇస్మార్ట్ శంకర్`తో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది నిధి అగర్వాల్. ఈ సినిమా విజయంతో వరుస ఆఫర్లు వచ్చాయి. పవన్‌తో `హరిహరవీరమల్లు`, `హీరో`తోపాటు తమిళంలో రెండు సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు అందాల ఫోటో షూట్లకే పరిమితమవుతుంది. పవన్‌తో చేస్తున్న `హరిహరవీరమల్లు` ఎప్పుడవుతుందో తెలియని స్థితిలో ఆయోమయంలో ఉండిపోతుంది.
ఎప్పుడో `చిరుత` చిత్రంతో తెలుగులో సందడి చేసిన నేహా శర్మ.. హిందీకి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు కేవలం ఒకే ఒక మూవీ ఆమె చేతిలో ఉంది. కానీ అందాల విందులో మాత్రం హద్దులు చెరిపేస్తుంది. బోల్డ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది.
`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో పాపులర్ అయిన మరో బ్యూటీ నభా నటేష్. `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో మెరిసింది. సినిమాలన్నీ పరాజయం చెందడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ గల్లంతయ్యాయి. దీంతో ఫోటో షూట్లకే పరిమితమయ్యింది నభా నటేష్.
ఒకప్పుడు తెలుగులో ఓ ఊపు ఊపిన మీరా జాస్మిన్ సైతం ఇప్పుడు వరుస ఫోటో షూట్లతో మైండ్ బ్లాక్ చేస్తుంది. రీఎంట్రీ తర్వాత ఆమె ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో ఆఫర్ లేదు. కానీ స్కిన్ షో విషయంలో నాన్ స్టాప్‌గా రెచ్చిపోతూ షాకిస్తుందీ సీనియర్ భామ.
లావణ్య త్రిపాఠి.. అందం, అభినయంతో కెరీర్‌ని లాక్కొచ్చిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు డీలా పడింది. మొన్న `హ్యాపీ బర్త్ డే` చిత్రంతో ఆమె పనైపోయిందనే టాక్ స్టార్ట్ అయ్యింది. కానీ సెక్సీ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ కి, ఇటు నెటిజన్లకి ఎర వేస్తుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిందీ అందాల భామ. గోవా బ్యూటీగా పాపులర్ అయ్యింది. సన్నని నడుము చుట్టూ టాలీవుడ్‌ని తిప్పుకున్న ఈ భామ చేతిలో ఆఫర్లు లేవు. రెండేళ్ల క్రితం ఒప్పుకున్న ఒకటి అర సినిమాలే చేస్తుంది ఇలియానా. కానీ గ్లామర్ షోలతోమాత్రం పిచ్చెక్కిస్తుంది.
`అఖండ` ముందు వరకు ప్రగ్యా జైశ్వాల్ పని అయిపోయిందన్నారు. బాలయ్య `అఖండ`తో ఇచ్చిన హిట్‌తో ఇక మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టే అన్నారు. కానీ ఇప్పటి వరకు మరో ఛాన్స్ రాలేదు. కానీ వరల్డ్ టూర్ వేస్తూ అందాల విందు వడ్డిస్తుంది ప్రగ్యాజైశ్వాల్. అందాలు చూపించడం తప్ప సినిమా ఆఫర్స్ రావడం లేదనే టాక్ ఉంది.
మెహరీన్.. `ఎఫ్3` వరకు ఈ అమ్మడి జోరు సాగింది. అనిల్‌రావిపూడి పుణ్యమా అని ఆమె ఇన్నాళ్లు కెరీర్‌ని లాక్కొచ్చింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ అందాలు ఆరబోయడంలోముందే ఉంటుంది. పిచ్చెక్కించే అందాలను ఏమాత్రం దాచుకోకుండా చూపిస్తూ రెచ్చగొడుతుంది. అవకాశాల వేటలో వరుస ఫోటో షూట్లు చేస్తుంది. కానీ ఛాన్స్ లే తలుపు తట్టడం లేదు.
`ఆర్‌ఎక్స్ 100` బ్యూటీగా పేరుతెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ చేతిలోనూ పెద్దగా అవకాశాలు లేవు. ఎప్పుడో ఒప్పుకున్న `తీస్‌మార్ ఖాన్` విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు మంచు విష్ణుతో `జిన్నా` చిత్రంలో నటిస్తుంది. ఇవి రిలీజ్ అయితే ఈ అమ్మడి చేతిలో జీరో ఆఫర్స్ అని చెప్పాలి. కానీ గ్లామర్ ఫోటో షూట్లతో మాత్రం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
పూర్ణ.. ఓ వైపు టీవీషోస్, మరోవైపు చిన్న సినిమాలతో మెరిసేది పూర్ణ. ఇటీవల `అఖండ`, `దృశ్యం2`, `తలైవి` వంటి చిత్రాలతోమెరిసింది. ఆమె నటించిన ఒకటిరెండు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కొత్తగా ఆమెచేతిలో సినిమాలు లేకపోవడం గమనార్హం. కానీ సోషల్ మీడియాలో అందాలు విందు మాత్రం నాన్ స్టాప్‌గా ఇస్తుంది. అయితే ఇక ఛాన్స్ తగ్గిపోయాయని భావించిందో ఏమో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది.
మరో హాట్ బ్యూటీ ఈషా రెబ్బా సైతం హాట్ పోజులతో నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. డస్కీ అందాలతో పిచ్చెక్కిస్తుంది. కానీ ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఓ చిత్రం చేస్తుంది. అది కూడా చాలా రోజుల క్రితం ఒప్పుకున్నదే. కొత్తగా మరే ఆఫర్ లేదు, కానీ అందాల ఆరబోతలో మాత్రం తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది.
ఇలా ఈ అందాల భామలందరు అందాల ఆరబోతతో నెటిజన్లని ఆకర్షిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. అదే సమయంలో మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా హీరోయిన్‌గా రాణించాలంటే అందమే కాదు, అభినయం, కొంత అదృష్టం కూడా తోడవ్వాల్సిందే.