MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Christmas 2021 : రాశి ఖన్నా గ్లామరస్ విషెస్.. టీ షర్ట్, టైట్ జీన్స్ లో ఫెస్టివ్ ట్రీట్ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ!

Christmas 2021 : రాశి ఖన్నా గ్లామరస్ విషెస్.. టీ షర్ట్, టైట్ జీన్స్ లో ఫెస్టివ్ ట్రీట్ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ!

రాశి ఖన్నా ఫెస్టివ్ మూడ్ లో ఉన్నారు. ఆమె ఫ్యాన్స్ కి క్రిస్మస్ 2021 (Christmas 2021) విషెస్ తెలియజేశారు. తన సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 25 2021, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని, ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకున్నారు. వైట్ టీ షర్ట్, జీన్స్ ధరించిన రాశి ఖన్నా పండగ వేళ మరింత అందంగా కనిపించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

చేతి నిండా సినిమాలతో కెరీర్ ఫుల్ జోష్ లో ఉండగా ఆ ఆనందం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాశి (Raashi khanna)పండగ శుభాకాంక్షలు తెలియజేయంతో ఫ్యాన్స్ కేజ్రీగా ఫీల్ అవుతున్నారు. ఆమెను తిరిగి కామెంట్స్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 
 

310

కాగా రాశి ఖన్నా టాలీవుడ్ కి వచ్చి ఏడేళ్లు అవుతుంది. ఈ ఏడేళ్ల కెరీర్ లో రాశి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా 25 సినిమాలకు  పైగా చేశారు. అయితే ఆమె స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కించుకోలేకపోయారు. 
 

410

రాశి కెరీర్ మొత్తం టూ టైర్ హీరోలతోనే సరిపోయింది. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టే అవకాశం ఆమెకు దక్కలేదు. సాలిడ్ అందాలతో కిరాక్ తెప్పించే ఈ పొడుగు సుందరి కెరీర్ కి అదొక రిగ్రీట్ అని చెప్పాలి. అయితే ఆమె అవకాశాలు ఇంకా మూసుకు పోలేదు. తెలుగులో చిత్రాలు చేస్తున్న రాశికి, స్టార్స్ తో జతకట్టే చాన్సులను కొట్టిపారేయలేం. 
 

510

వెండితెరపై మితిమీరిన గ్లామర్ పంచే రోల్స్ ఆమెకు దక్కలేదు. వెండితెరపై అందాలు ప్రదర్శించే అవకాశం దక్కకున్నా.. సోషల్ మీడియా ద్వారా తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాకు సెగలు పుట్టిస్తుంది. 
 

610

 ఊహలు గుసగుసలాడే మూవీతో రాశి ఖన్నా పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా నటించగా రాశి ఖన్నా పాత్ర బాగా ఆకట్టుకుంది. 
 

710


ఆ తరువాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ దక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. పెద్దగా హిట్ పర్సెంటేజ్ లేకున్నా, జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది రాశి ఖన్నా. రాశి ఖన్నా కెరీర్ లో నటించిన అతిపెద్ద స్టార్ ఎన్టీఆర్ కావడం విశేషం. 
 

810


హద్దులు లేని స్కిన్ షోకి ఆమె దూరంగా ఉన్నారు. ఓ మోస్తరుగా పొట్టి బట్టలు ధరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అయితే అనూహ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశి ఖన్నా బోల్డ్ రోల్డ్ చేశారు. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేసిన రొమాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ ని షాక్ కి గురిచేసింది. 

910


అంత పెద్ద రిస్క్ చేసిన రాశికి సినిమా పరాజయంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. రాశి అలాంటి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేసి ఉండాల్సింది కాదని రాశి సన్నిహితులతో వాపోయారన్న వార్తలు కూడా రావడం జరిగింది. 

1010

లాక్ డౌన్ తరువాత రాశి కెరీర్ మరలా ఊపందుకుంది. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా మారారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు పక్కా కమర్షియల్, థ్యాంక్యూ  లతో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే రెండు వెబ్ సిరీస్ లలో రాశి ఖన్నా నటిస్తున్నారు.

Also read Sreemukhi: నడుము సొగసుతో ప్రాణాలు తోడేస్తోంది, అందాల బొమ్మ అంటున్న నెటిజన్లు.. శ్రీముఖి స్టన్నింగ్ పిక్స్

Also read Rashmika stuns in black: బ్లాక్ శారీలో హాట్ క్లీవేజ్ షో.. జబ్బలు జాకెట్ లో అందాల ప్రదర్శన చేసిన రష్మిక మందాన!

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Recommended image2
Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!
Recommended image3
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved