- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకిపై అనుమాన పడుతున్న గోవిందరాజులు.. అసలు విషయం తెలుసుకుని సంతోషపడుతున్న మల్లిక?
Janaki Kalaganaledu: జానకిపై అనుమాన పడుతున్న గోవిందరాజులు.. అసలు విషయం తెలుసుకుని సంతోషపడుతున్న మల్లిక?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 24 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్ లో జానకి దగ్గరగా రావడంతో అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు జానకి చూడు అఖిల్ అర్థం కి అపార్థం కి కేవలం ఒక్క అక్షరం మాత్రమే తేడా ఉంటుంది. అర్థం చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చు అపార్థం చేసుకుంటే సమస్యలు వస్తాయి. తప్పించుకోవడానికి దారులు వెతికే ముందు ఆలోచించే ఏదైనా పనిచేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి అనుకుంటుండగా అప్పుడు అఖిల్ నాకు ఈ సోదంతా ఎందుకురా అనుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకటి ఆలోచించు ఇతని బిడ్డ జైల్లో ఉంటేనే ఒక తల్లి అంతగా తల్లి డిల్లి పోతే మరొకవైపు తన కూతురు కోమాలో ఉంటే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకో అఖిల్ అని అంటుంది.
కళ్ళముందే కన్న కూతురు ప్రాణాలతో పోరాడుతుంటే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకో అఖిల్ అని అంటుంది. చేసిన తప్పు క్షమించాలి అంటే మాధురికి ఏం కాకూడదు అని ఆ దేవుడిని కోరుకో అఖిల్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జానకి. మరొక ఆ తర్వాత అత్త ఒడి అంటూ పిచ్చిపిచ్చిగా పాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉండగా అది జ్ఞానాంబ దంపతులు చూస్తారు. వాళ్ళని చూసిన మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు జ్ఞానాంబ ఏంటి మల్లికా ఈ తింగరి వేషాలు కడుపులో బిడ్డ ఉంది అన్న విషయాన్ని మరిచిపోయావా అంటూ మల్లికకు ఫుల్లుగా క్లాస్ పీకుతుంది. మంచి మంచి ఫుడ్ తిను అని చెబుతుండగా ఇంతలో అక్కడికి జానకి వస్తుంది.
అత్తయ్య గారు భోజనానికి సిద్ధం చేయమంటారా అని అనగా ఈ పనులు అని నిన్ను ఎవరు చేయమన్నారు జానకి. నువ్వు ఈరోజు కూడా ఎందుకు కాలేజీకి వెళ్లలేదు అని అనగా వెళ్లాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు అని అనగా ఎందుకు జానకి అని అనడంతో అప్పుడు రామచంద్ర అక్కడికి వచ్చి అమ్మ కాలేజీకి మూడు నాలుగు రోజులు సెలవులు అందుకే ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటానని చెప్పారు అని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడు గోవిందరాజులు రామచంద్ర జానకి మీద అనుమాన పడతాడు. ఆ తర్వాత రామచంద్ర జానకి దగ్గరికి చదువు గురించి మాట్లాడడానికి వెళ్లగా అప్పుడు వంట చేస్తూ ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది జానకి.
ఆ తర్వాత రామచంద్ర జానకిని గదిలోకి రమ్మని చెప్పి చదువు విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు రామచంద్ర నిజంగానే నేను తప్పు చేశాను. తమ్ముడు కావాలి అన్న భయంతో నేను మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నానో అర్థం కాకుండా నిజంగానే పెద్ద తప్పు చేశాను జానకి గారు ఆ తప్పును సరిదిద్దుకునే సమయం వచ్చింది అని అంటాడు. అప్పుడు రామచంద్ర జానకిని చేతులు పట్టుకుని మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను మీరు మళ్ళీ బడిలోకి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు రామచంద్ర ఎన్ని చెప్పినా కూడా జానకి అలాగే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత గోవిందరాజులు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. అప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని అనడంతో జానకి గురించి ఆలోచిస్తున్నాను అని చెబుతాడు. గమనించావో లేదో జానకి నవ్వులో జీవం లేదు కొన్ని రోజులుగా ముభావంగా ఉంటుంది లోపల ఏదో బాధపడుతుంది అని అంటాడు గోవిందరాజులు. లోపల బాధను దాచుకొని బయటికి మాత్రం నవ్వుతూ అందరిని నవ్విస్తోందని నాకు అనిపిస్తోంది జ్ఞానం అని అంటాడు గోవిందరాజులు. అప్పుడు జ్ఞానాంబ జానకితో ఇప్పుడే వెళ్లి మాట్లాడతాను అని అక్కడికి వెళుతుంది. మరోవైపు జానకి తినడానికి సిద్ధం చేస్తూ ఉండగా అంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది.
ఇంతలోనే అక్కడికి రామచంద్ర వస్తాడు. అప్పుడు రామచంద్ర అక్కడికి వచ్చి మీరు నిజాన్ని దాచి పెట్టాలి అనుకుంటున్న అమ్మ వాళ్లకి అనుమానం వచ్చింది పాపం వాళ్ళు ఇంకా ఏదో అనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు రామచంద్ర మాట్లాడుతుండగా జానకి పట్టించుకోకుండా వెళ్ళిపోతుండడంతో ఆ మాటలు మల్లిక మధ్య ఏదో జరుగుతోంది ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి గదిలో మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మల్లిక అక్కడికి వెళ్లి వారి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు వారి మాటలు విన్న మల్లిక సంతోష పడుతూ ఉంటుంది.
ఇంతలోనే అక్కడికి రామచంద్ర వస్తాడు. అప్పుడు రామచంద్ర అక్కడికి వచ్చి మీరు నిజాన్ని దాచి పెట్టాలి అనుకుంటున్న అమ్మ వాళ్లకి అనుమానం వచ్చింది పాపం వాళ్ళు ఇంకా ఏదో అనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు రామచంద్ర మాట్లాడుతుండగా జానకి పట్టించుకోకుండా వెళ్ళిపోతుండడంతో ఆ మాటలు మల్లిక మధ్య ఏదో జరుగుతోంది ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి గదిలో మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మల్లిక అక్కడికి వెళ్లి వారి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు వారి మాటలు విన్న మల్లిక సంతోష పడుతూ ఉంటుంది.