MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త యాంకర్ ని కెలికి పరువుతీసుకున్నాడు.. పిల్లాడిలా కనిపించే నరేష్ కి కూడా ఆ పాడు అలవాట్లు ఉన్నాయా..

కొత్త యాంకర్ ని కెలికి పరువుతీసుకున్నాడు.. పిల్లాడిలా కనిపించే నరేష్ కి కూడా ఆ పాడు అలవాట్లు ఉన్నాయా..

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. రష్మీ తరహాలోనే జబర్దస్త్ కమెడియన్లు కొత్త యాంకర్ సౌమ్యపై పంచ్ లు వేస్తున్నారు. ఆమెని అనవసరంగా కెలుకుతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 02 2022, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ వరుసగా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఆ మధ్యన యాంకర్ అనసూయ జబర్దస్త్ కి దూరమైంది.  ఇప్పుడు అనసూయ బాటలోనే యాంకర్ రష్మీ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. అయితే రష్మీ మళ్ళీ ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు. దీనితో జబర్దస్త్ కోసం సౌమ్య అనే కొత్త యాంకర్ ని తీసుకువచ్చారు. రాగానే సౌమ్య అందరి దృష్టిని ఆకర్శించే విధంగా హంగామా చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. రష్మీ తరహాలోనే జబర్దస్త్ కమెడియన్లు కొత్త యాంకర్ సౌమ్యపై పంచ్ లు వేస్తున్నారు. ఆమెని అనవసరంగా కెలుకుతున్నారు. కానీ రష్మీ లాగా సౌమ్య బలికావడం లేదు. తిరిగి అదే రేంజ్ లో పంచ్ లు పేల్చుతోంది. తనని కెలికేవారి గాలి తీస్తోంది. గతంలో సౌమ్య.. హైపర్ ఆదికి నా దగ్గర పులిహోర కలపొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. 

36

లేటెస్ట్ ప్రోమోలో సౌమ్య దెబ్బకు పాపం జబర్దస్త్ నరేష్ బలయ్యాడు. పిల్లాడిలా కనిపించే నరేష్ దగ్గర కూడా కొంటె వేషాలు ఉన్నాయి. లేటెస్ట్ ప్రోమోలో నరేష్ అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో ఎంట్రీ ఇచ్చాడు. కొత్త యాంకర్ సౌమ్య దగ్గరకి వెళ్లి ఆమెని టీజ్ చేసే ప్రయత్నం చేశాడు. 'ఆహా నేను నీకు నచ్చి ఉండొచ్చు.. కానీ ఈ జన్మని నువ్వు నన్ను దక్కించుకోలేవు.. బెటర్ లక్ నెక్స్ట్ టైం నాన్న అంటూ వెళ్ళిపోయాడు. 

46

దీనితో సౌమ్య.. ఫస్ట్ టైం ఈ అబ్బాయిని ఇంత దగ్గరగా చూస్తున్నాను అంటూ అతడి హైట్ గురించి పరోక్షంగా సెటైర్ వేసింది. ఇంతలో మరో కమెడియన్ హైపర్ ఆది కటౌట్ తీసుకుని వస్తాడు. నరేష్ తనతో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ కమెడియన్లతో హైపర్ ఆది గురించి చెబుతాడు. ఆయన తెలుసా మీకు, శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మందిని గోకుతా ఉంటాడు అని అంటాడు. వేంటనే పక్కనే ఉన్న ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నరేష్ పరువు తీస్తుంది. 

56

ఆయనే కాదు.. ఈడు కూడా గోకుతా ఉంటాడు.. కానీ పిల్ల నాయాలని ఎవరూ పట్టించుకోరు అని చెప్పడంతో అంతా నవ్వులు పూశాయి. జబర్దస్త్ షోకి కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. 

66

కృష్ణ భగవాన్ కూడా జబర్దస్త్ కమెడియన్లతో పోటీగా కామెడీ పంచ్ లు పేల్చడం విశేషం. ఇక కమెడియన్ నూకరాజు ఐ మూవీ గెటప్ తో ప్రత్యక్షమై నవ్వించాడు. రాకెట్ రాఘవ స్కిట్ కూడా ఆకట్టుకునే విధంగానే ప్రోమోలో కనిపించింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 8న ప్రసారం కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved