MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫైమా ఎలిమినేటెడ్.. పాపం ఆ పిల్ల అంటూ ఏడుపు ఆపుకోలేకపోయిన ఆదిరెడ్డి

ఫైమా ఎలిమినేటెడ్.. పాపం ఆ పిల్ల అంటూ ఏడుపు ఆపుకోలేకపోయిన ఆదిరెడ్డి

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా మారుతోంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ మంచి ఫన్ ఎలిమెంట్స్ తో సాగింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2022, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా మారుతోంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ మంచి ఫన్ ఎలిమెంట్స్ తో సాగింది. హిట్ 2తో విజయం అందుకున్న అడివి శేష్ ఈ ఎపిసోడ్ కి అతిథిగా హాజరయ్యాడు. నాగార్జునతో కలసి బిగ్ బాస్ వేదికని కాసేపు పంచుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇవ్వగానే బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఫన్ గేమ్ మొదలు పెట్టాడు. ఒక్కొక్కరిని పిలిచి హౌస్ లో తనకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ షిప్ ఎవరితో ? ఫ్రెండ్ షిప్ కట్ చేసుకోవడం ఎవరితో ? అని ప్రశ్నించాడు. ఇంటి సభ్యులు టేబుల్ పై ఉన్న ఫోటోలు తీసుకుని తమ సమాధానం చెప్పాలి. ఇలా ఒక్కొక్కరూ తమ ఫ్రెండ్ ఎవరో, ఫ్రెండ్ షిప్ కట్ ఎవరో తెలిపారు. ఈ క్రమంలో చాలా సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

36

ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఆదిరెడ్డి, శ్రీసత్య, రేవంత్, ఫైమా నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో రేవంత్ మాత్రమే సేవ్ అయ్యాడు. దీనితో రేవంత్ తనకి ఓట్లు వేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు కుమార్తె పుట్టింది. అక్కడ తల్లి బిడ్డా సేఫ్.. ఇక్కడ నేను సేఫ్ అంటూ సంతోష పడ్డాడు రేవంత్. 

46

ఇంతలో బిగ్ బాస్ హౌస్ లోకి హిట్ 2 టీం హీరో అడివి శేష్, దర్శకుడు శైలేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో ఫన్నీగా మాట్లాడుతూ కొన్ని గేమ్స్ కూడా ఆడారు. శ్రీహాన్.. మీనాక్షి విషయంలో పులిహోర కలుపుతున్నాడు అంటూ అడివి శేష్ అతడిని ఆటపట్టించారు. హిట్ 2 విజయం సాధించింది అని తెలుసుకున్న హౌస్ మేట్స్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

56

హిట్ 2 టీం వెళ్ళిపోయాక నాగార్జున నామినేషన్స్ లో ఉన్న వారిలో మరొకరిని సేవ్ చేశారు. ఆదిరెడ్డి, ఫైమా, శ్రీ సత్య నామినేషన్స్ లో ఉండగా.. వారిలో శ్రీ సత్య సేవ్ అయింది. ఆయా తర్వాత కొన్ని ఫన్ గేమ్స్ ఆడారు. అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. 

66

నామినేషన్స్ లో ఆదిరెడ్డి, ఫైమా మాత్రమే మిగిలారు. రెండు క్లౌడ్ కింద వారిద్దరూ నిలబడ్డారు. రెడ్ ఫ్లవర్స్ పడడంతో ఫైమా ఎలిమినేట్ అయింది. దీనితో ఫైమా హౌస్ ని వీడి వెళ్లక తప్పలేదు. గేటు వద్దకు వెళ్లేసరికి ఫైమా ఎమోషనల్ అయింది. ఆదిరెడ్డికి ఉదయాన్నే ఎగ్ ఇవ్వండి అంటూ ఇతర సభ్యులకు ప్రేమగా తెలిపింది. పాపం ఆ పిల్ల తనని ఎంతగా గుర్తు పెట్టుకుందో అని ఆదిరెడ్డి కంటతడి పెట్టుకున్నాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Recommended image2
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image3
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved