MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీప మాటలు నమ్మి మోనితను నిలదీసిన కార్తీక్.. మంగళ సూత్రాన్ని బయటపెట్టిన దీప.?

Karthika Deepam: దీప మాటలు నమ్మి మోనితను నిలదీసిన కార్తీక్.. మంగళ సూత్రాన్ని బయటపెట్టిన దీప.?

Karthika Deepam: బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఆగస్ట్ 30వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Aug 30 2022, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ పడుకుని ఉండగా ఇంతలో అక్కడికి మోనిత వచ్చి కార్తీక్ కీ దుప్పటి కప్పి  కార్తీక్ వైపు అలా చూస్తూ మన ప్రేమకు ఇన్ని అడ్డంకులు ఏంటి కార్తీక్, దీప ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకుంటే మళ్ళీ నీ ఫోటో పట్టుకుని రోడ్లమీద తిరుగుతుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మోనిత. మరి ఏదో ఒక రోజు నా దగ్గర కార్తీక్ ఉన్నాడు అని ఆ దీపకీ తెలిస్తే పరిస్థితి ఏమి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 మరొకవైపు సౌందర్య, ఆనందరావు లు మోనిత గురించి ఆలోచిస్తూ మోనిత ప్రవర్తన పై అనుమాన పడుతుంటారు. అప్పుడు సౌందర్య,మోనిత విషయంలో నాకు కొంచెం భయంగా ఉంది అనడంతో ఆనందరావు అదంతా ఏం జరగదు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతాడు. అయినా కూడా సౌందర్య పదేపదే మోనిత అన్న మాటలు గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ అతని డ్రైవర్ శివ కార్ లో వెళ్తూ ఉండగా అప్పుడు శివ మేడంకి మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు చెబుతాను సార్ అని అనడంతో వెంటనే కార్తీక్ కోపంతో కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటాడు.
 

36

ఇంతలోనే అటుగా దీప వస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నేను రాను అంటు నడుచుకుంటూ వెళుతుండగా డ్రైవర్ బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసిన దీప, డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని అరుస్తూ డాక్టర్ బాబు దగ్గరికి వచ్చేసరికి కార్తీక్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీప ఆటోలో కార్తీక్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇంతలోనే దీప, డాక్టర్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా వివరిస్తుంది. మరొకవైపు శౌర్య ఆటో కి వెనుకవైపు అమ్మానాన్న ఎక్కడ ఉన్నారు అని రాసి దాన్ని చూసి ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే వారణాసి అక్కడికి రావడంతో వారణాసిని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు పంపించారు అని చెప్పి తనపై సీరియస్ అవుతుంది.
 

46

అప్పుడు వారణాసి లేదమ్మా అని చెప్పడంతో అప్పుడు సౌర్య సైలెంట్ అయిపోతుంది. అప్పుడు వారణాసికి నా బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది ఎవరికీ చెప్పొద్దు అని చెబుతుంది శౌర్య. అప్పుడు సౌర్య,ఇంద్రమ్మ దంపతులను పిలిచి మా మామయ్య అని చెప్పి వాళ్లకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ని ఫాలో అవుతూ మోనిత బట్టల షాప్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు కార్తీక్ లోపల వెళుతుండగా దీప కూడా కార్తీక్ ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తుంది.
 

56

ఇంతలోనే డాక్టర్ బాబు అంటూ అక్కడికి వెళుతుంది. అప్పుడు డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ గా మాట్లాడగా నేను మీ డాక్టర్ బాబుని కాదు అనడంతో వెంటనే అక్కడికి ఎవరు కార్తీక్ అంటూ మోనిత వస్తుంది. అప్పుడు దీప,మోనిత ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. అప్పుడు దీప ,మోనిత ను నిలదీయగా మోనిత దీప అంటే ఎవరో తెలియనట్టుగా నటిస్తుంది. అప్పుడు కార్తీక్,ఈమెకు నువ్వు ఎవరో తెలిసినప్పుడు నేను కూడా తెలిసి ఉంటుంది కదా అని అనగా మోనిత మాత్రం లేదు కార్తీక్ అది ఏదో పిచ్చిది అని అంటుంది. 
 

66

అంతే కాకుండా నేను ఈమెను ఇంతవరకు చూడలేదు అంటూ నటిస్తుంది మోనిత. అప్పుడు దీప మాటలు నమ్మిన కార్తీక్ మోనితను నిలదీస్తాడు. కానీ మోనిత మాత్రం ఏం చెప్పకుండా అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడు డబ్బు కోసం ఇలాంటి వాళ్ళు వస్తుంటారు అని మోనిత అనగా, ఎవరి డబ్బు కోసం వచ్చింది నా మాంగల్యం కోసం వచ్చాను అంటూ దీప తన తాళిబొట్టును చూపిస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Recommended image3
Suriya 200 Crore Club: సూర్యకు తొలి 200 కోట్ల సినిమా 'కరుప్పు'.. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న చిత్రాలివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved