Deepika Padukone: దీపికా, రణ్వీర్ సింగ్ దంపతులు రెండో సారి తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సెలెబ్రిటీలు దీపికా, రణ్వీర్ లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతుల ఇంటికి మరో చిన్నారి వచ్చేసింది. వీరికి రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. కొన్ని నెలల క్రితమే దీపికా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వీరు అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు రెండో పాప రాకతో అభిమానులు అంతా పండగ చేసుకుంటున్నారు.
రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా, రణ్‌వీర్
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ స్పెషల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. అప్పటి నుంచి అభిమానులు అంతా గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా ఇప్పుడు తమ రెండో కూతురికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ దీపికా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. బేబీ గర్ల్ పుట్టింది అని ప్రకటించారు.
ఇప్పుడు పెద్దక్క అయిన దువా పదుకొణె సింగ్
వీరి మొదటి కూతురు దువా పదుకొణె సింగ్ సెప్టెంబర్ 8, 2024న పుట్టింది. రీసెంట్‌గానే పాపకు రెండేళ్లు నిండాయి. ఆ స్పెషల్ డే రోజున దీపికా, రణ్‌వీర్ కొన్ని రేర్ ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇప్పుడు రెండో పాప పుట్టడంతో, దువా అధికారికంగా పెద్దక్క పాత్రలోకి అడుగుపెట్టింది.
పాన్ ఇండియా స్టార్లుగా దీపికా, రణ్వీర్
దీపికా, రణ్‌వీర్ ఎప్పుడూ తమ ఫ్యామిలీ లైఫ్‌ను, ముఖ్యంగా పిల్లల విషయాలను చాలా ప్రైవేట్‌గా ఉంచుతారు. దువాకు సంబంధించిన ఫొటోలను కూడా చాలా తక్కువే బయటపెట్టారు. దీపికా, రణ్వీర్ ఇద్దరూ ప్రస్తుతం తిరుగులేని పాన్ ఇండియా స్టార్లుగా రాణిస్తున్నారు.


