MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున

Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. హౌస్ నుంచి ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయాన్ని నాగార్జున పరోక్షంగా చెప్పేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2026, 11:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

కింగ్ నాగార్జున హౌస్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో భాగంగా శనివారం వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. స్టేజీపైకి వచ్చేసిన నాగార్జున సరదాగా షోని నడిపిస్తూ అందరి లెక్కలు తేల్చేశారు. ఈ వారం హౌస్ లో జరిగిన వివాదాలని అడ్రెస్ చేస్తూ తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. ఆడియన్స్ ని అడిగి తప్పు ఎవరిదో తెలుసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాళ్ళిద్దరినీ దూరం పెట్టిన నాగ్
Image Credit : Asianet News

వాళ్ళిద్దరినీ దూరం పెట్టిన నాగ్

నాగార్జున స్టేజీ పైకి రాగానే ఈ వారం గేమ్ చాలా బాగా ఆడారు అని హౌస్ మేట్స్ ని అభినందించారు. కానీ ఇద్దరు మాత్రం అసలు హౌస్ లో కనిపించలేదు. అందరూ ఎంతో యాక్టివ్ గా గేమ్ ఆడుతున్నా ఇద్దరు మాత్రం సైలెంట్ గా కూర్చుండి పోయారు అని అన్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు కృష్ణుడు, మరొకరు సృష్టి. దీనితో వాళ్ళకి పనిష్మెంట్ గా నాగార్జున వాల్లిద్దరినీ ఇన్వాల్వ్ చేయకుండా దూరంగా కూర్చో బెట్టారు.

35
కిచెన్ లో గొడవల గురించి
Image Credit : Asianet News

కిచెన్ లో గొడవల గురించి

ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి హౌస్ లో మ్యాన్యుపులేటర్ ఎవరు.. పప్పెట్ ఎవరు అనేది చెప్పాలి అని నాగార్జున అడిగారు. హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పారు. వర్షిణి, షాలిని, రోహిత్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు హై లైట్ అయ్యారు. కిచెన్ లో త్రిగుణ్, వంశీ తరచుగా హౌస్ మేట్స్ తో గొడవ పెట్టుకోవడం చూశాం. నాగార్జున దాని గురించి చెబుతూ వాళ్ళిద్దరికీ క్లాస్ పీకారు. ఆ ఫుడ్ మానిటర్ అయిన దేబ్జానీని కూడా మందలించారు.

45
షాలినిదే తప్పు
Image Credit : Asianet News

షాలినిదే తప్పు

వర్షిణి, షాలిని మధ్య జరిగిన గొడవ కూడా ప్రస్తావనకు వచ్చింది. వర్షిణి తనని చేతులతో నెట్టింది అని షాలిని ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ ఆ గొడవలో ఎక్కువగా రెచ్చగొట్టింది షాలినినే అని నాగార్జున తేల్చారు. నాగార్జున మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఆ గొడవలో తప్పు షాలినిదే అని తెలిపారు.

55
రోహిత్ డేంజర్ గేమ్
Image Credit : Asianet News

రోహిత్ డేంజర్ గేమ్

ఆ తర్వాత రోహిత్, దేబ్జానీ.. రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఆడిన గేమ్ లో రోహిత్ చాలా డేంజర్ గా ఫిజికల్ అటాక్ చేసిన దృశ్యాలని నాగార్జున చూపించారు. రోహిత్ మాత్రం తాను చాలా జాగ్రత్తగా ఆడానని చెప్పారు. కానీ ఆడియన్స్ ఒప్పుకోలేదు. రోహిత్ చేసింది తప్పు అని తేల్చేశారు. దీనితో రోహిత్ క్షమాపణలు చెప్పారు. వర్షిణి, రామ్ ప్రసాద్ సంచాలకులుగా ఫెయిల్ అయిన విషయాన్ని కూడా నాగ్ ప్రస్తావించారు. ఇక ముఖేష్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, షాలిని నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. వర్షిణి, సుధీర్, కృష్ణుడు, సృష్టి, రోహిత్, త్రిగుణ్ నామినేషన్స్ లోనే ఉన్నారు. ఈ వారం హౌస్ లో అస్సలు కనిపించలేదు అని నాగార్జున చెప్పిన కృష్ణుడు, సృష్టి లలో ఒకరు ఆదివారం రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Recommended image2
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Recommended image3
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Related Stories
Recommended image1
Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం
Recommended image2
Ravi Teja: కృష్ణ వంశీ నుంచి రాజమౌళి వరకు, రవితేజ కెరీర్ నిలబెట్టిన దర్శకులు.. మాస్ మహారాజ్ కి ఎవరు ఇష్టమో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved