MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishwambhara: అందుకే నిన్ను 'విశ్వంభరుడు' అని పిలిచేది.. డైరెక్టర్ పోస్ట్ తో రిలీజ్ పై మళ్ళీ రచ్చ షురూ

Vishwambhara: అందుకే నిన్ను 'విశ్వంభరుడు' అని పిలిచేది.. డైరెక్టర్ పోస్ట్ తో రిలీజ్ పై మళ్ళీ రచ్చ షురూ

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై మళ్లీ చర్చ మొదలైంది. దర్శకుడు వశిష్ఠ తాజా పోస్ట్‌తో సినిమా రిలీజ్‌పై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఈ చిత్రం సంక్రాంతికి వస్తుంది అంటూ ప్రచారం జరిగింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి సినిమాలపై ఆసక్తికరమైన చర్చ
Image Credit : Instagram

చిరంజీవి సినిమాలపై ఆసక్తికరమైన చర్చ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చిరంజీవి నటించిన రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి బరిలో ఉంటుందనే చర్చ మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వశిష్ఠ పోస్ట్‌తో కొత్త ఊహాగానాలు
Image Credit : youtube print shot/UV creations

వశిష్ఠ పోస్ట్‌తో కొత్త ఊహాగానాలు

‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ చర్చను మరింత పెంచింది. శివుడికి సంబంధించిన ఓ ప్రవచన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఓం నమః శివాయ’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. ‘‘ఇందుకేనా నిన్ను విశ్వంభరుడు అని పిలిచేది? సర్వం శివం’’ అంటూ ఆ పోస్టును ముగించారు. ఈ పోస్ట్‌కు ‘విశ్వంభర’ విడుదల పరిస్థితులకు ఏమైనా సంబంధం ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

35
వీఎఫ్‌ఎక్స్ పనులే ప్రధాన కారణమా?
Image Credit : stockphoto

వీఎఫ్‌ఎక్స్ పనులే ప్రధాన కారణమా?

‘విశ్వంభర’కు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికీ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కథలోని భారీ విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండటంతో వాటి పనులు పూర్తి చేయడానికి సమయం పడుతోందని గతంలో చిత్రబృందం నుంచి సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు విడుదల ఆలస్యానికి వీఎఫ్‌ఎక్స్‌తో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.

45
నిర్మాణ సంస్థ ఆర్థిక పరిస్థితులపై టాక్
Image Credit : x

నిర్మాణ సంస్థ ఆర్థిక పరిస్థితులపై టాక్

వీఎఫ్‌ఎక్స్ పనులను పూర్తి చేయడానికి మరింత బడ్జెట్ అవసరమవుతుందని, అయితే నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా సినిమా పనులు కొంతకాలంగా నెమ్మదించాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ విడుదల విషయంలో స్పష్టత రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆర్థిక అంశాలపై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం ఇవి ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న వార్తలుగానే చూడాల్సి ఉంటుంది.

శ్వాస నాది, శాసనం నీది 
ఆశ నాది, పాశం నీది, 
ఆత్మ నాది, ఆట నీది…
ఎంత మాయగాడివయ్యా! 
ఓం నమః శివాయ!!!

ఇందుకేనా నిన్ను “విశ్వంభరుడు” అని పిలిచేది?!

సర్వం శివం.. ఓం నమః శివాయ !! pic.twitter.com/cXjVOj5YeV

— Vassishta (@DirVassishta) September 18, 2026

55
మోక్షజ్ఞ సినిమాపై వశిష్ఠ ఫోకస్?
Image Credit : social media

మోక్షజ్ఞ సినిమాపై వశిష్ఠ ఫోకస్?

ఇదిలా ఉంటే వశిష్ఠ తన తదుపరి సినిమాపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నందమూరి మోక్షజ్ఞను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన కథా పనుల్లో వశిష్ఠ బిజీగా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్‌పై ఆయన వర్క్ చేస్తున్నట్లు టాక్. దీంతో ‘విశ్వంభర’ విడుదల ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే చిరంజీవి సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు సంక్రాంతి విడుదలపై జరుగుతున్న చర్చలకు స్పష్టత వచ్చే అవకాశం లేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Recommended image3
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Related Stories
Recommended image1
Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం
Recommended image2
Ravi Teja: కృష్ణ వంశీ నుంచి రాజమౌళి వరకు, రవితేజ కెరీర్ నిలబెట్టిన దర్శకులు.. మాస్ మహారాజ్ కి ఎవరు ఇష్టమో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved