- Home
- Entertainment
- Ravi Teja: కృష్ణ వంశీ నుంచి రాజమౌళి వరకు, రవితేజ కెరీర్ నిలబెట్టిన దర్శకులు.. మాస్ మహారాజ్ కి ఎవరు ఇష్టమో తెలుసా
Ravi Teja: కృష్ణ వంశీ నుంచి రాజమౌళి వరకు, రవితేజ కెరీర్ నిలబెట్టిన దర్శకులు.. మాస్ మహారాజ్ కి ఎవరు ఇష్టమో తెలుసా
తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుల గురించి మాస్ మహారాజ్ రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి, కృష్ణ వంశి, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులలో తనకి ఎవరు ఎక్కువ ఇష్టమో రివీల్ చేశారు.

Ravi Teja
మాస్ మహారాజ్ రవితేజ తన కెరీర్ లో ఎందరో దర్శకులతో వర్క్ చేశారు. కానీ రవితేజకి తిరుగులేని సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులు కొందరు ఉన్నారు. రవితేజ లోని ట్యాలెంట్ ని ముందుగా గుర్తించిన దర్శకుడు కృష్ణ వంశీ. అందుకే సింధూరం మూవీలో అవకాశం ఇచ్చారు. రవితేజని హీరోగా నిలబెట్టిన దర్శకుడు మాత్రం పూరి జగన్నాధ్. ఆ తర్వాత రవితేజ కెరీర్ ని రాజమౌళి నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లారు. రవితేజలో ని కామెడీ టైమింగ్, ఎనెర్జీని వాడుకుంటూ వివి వినాయక్ ఓ సూపర్ హిట్ మూవీ చేశారు. ఈ దర్శకులలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అడగగా రవితేజ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఒకరి పేరు చెబితే మరొకరు వేరేలా అనుకుంటారు అనే ఆలోచన నాకు లేదు. కానీ ఆ దర్శకులని విడదీసి మాత్రం చెప్పలేను. సమస్యే లేదు.. ఆ నలుగురూ నాకు ఇష్టమైన దర్శకులే అని రవితేజ తెలిపారు.
కృష్ణ వంశీ
కృష్ణ వంశీ, రవితేజ కాంబినేషన్ లో ఖడ్గం లాంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో రవితేజ నటన అద్భుతం అనే చెప్పాలి. వర్ధమాన నటుడిగా ఈ మూవీలో రవితేజ కనిపించారు. విభిన్న అంశాల కథని దేశభక్తితో కృష్ణవంశీ ముడిపెట్టిన విధానం చాలా బావుంటుంది.
పూరి జగన్నాధ్
రవితేజ కెరీర్ కి పూరి జగన్నాధ్ మూలస్థంభంలా నిలిచారు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సూపర్ హిట్స్ వీరి కాంబినేషన్ లో వచ్చాయి.
రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు మూవీ అతడికి అల్టిమేట్ స్టార్ డమ్ తీసుకువచ్చింది. విక్రమార్కుడు లో రవితేజ డ్యూయెల్ రోల్ లో అదరగొట్టారు.
వివి వినాయక్
రవితేజ, వినాయక్ కాంబోలో వచ్చిన కృష్ణ మూవీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్. కామెడీ, పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

