MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా

Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా

చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఓ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. అయితే ఆ సినిమాని చెడగొట్టింది తాను కాదు అంటూ దర్శకుడు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు ఒక పండగ. అభిమానులు పూర్తి సంతృప్తినిచ్చే విధంగా సినిమా ఉండడం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. అలా బడ్జెట్ పెరిగిపోయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొన్ని చిరంజీవి సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మృగరాజు ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి, దేవి వరప్రసాద్ సినిమాలు
Image Credit : sunnxt

చిరంజీవి, దేవి వరప్రసాద్ సినిమాలు

చిరంజీవితో కొండవీటి రాజా, మంచి దొంగ, ఘరానా మొగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన దేవి వరప్రసాద్ మృగరాజు చిత్రానికి కూడా నిర్మాత. దేవి వరప్రసాద్, చిరంజీవి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. చిరంజీవి సినిమా అంటే దేవి వరప్రసాద్ ఖర్చుకు అస్సలు వెనుకాడరు. మృగరాజుకి ముందు చిరంజీవి, గుణశేఖర్ కాంబోలో వచ్చిన చూడాలని ఉంది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.

35
రిలీజ్ రోజే చనిపోయిన ఫీలింగ్
Image Credit : our own

రిలీజ్ రోజే చనిపోయిన ఫీలింగ్

వీరి ముగ్గురి కాంబోలో మరో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంచనాలకు తగ్గట్లుగానే చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో మృగరాజు సినిమాని నిర్మించారు. కానీ ఆ సినిమా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వలేదు. డిజాస్టర్ అయింది. ఈ సినిమా విషయంలో అసలు తప్పు ఎక్కడ జరిగిందో గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. మృగరాజు మూవీ రిలీజ్ అయిన రోజే తాను చనిపోయినట్లు అనిపించింది అని దేవి వరప్రసాద్ ఓ సందర్భంలో అన్నారు. అంటే అప్పటికే సినిమా రిజల్ట్ అర్థం అయిపొయింది.

45
అది అసలు నా కథ కాదు
Image Credit : Asianet News

అది అసలు నా కథ కాదు

గుణశేఖర్ మాట్లాడుతూ దేవి వరప్రసాద్ గారు నన్ను ఎక్కడైనా తప్పు పట్టారా ? అది మీరు విన్నారా ? అని ప్రశ్నించలేదు. అంత పెద్ద సినిమా ఫెయిల్ అయినప్పుడు ఏ నిర్మాతకి అయినా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ మూవీ విషయంలో నా తప్పు అయితే లేదు. ఆ సినిమాని చెడగొట్టింది నేను కాదు. మృగరాజు అసలు నా కథ కాదు. ఆల్రెడీ రెడీ అయిన కథలోకి నేను వచ్చాను. పైగా ఎప్పుడూ సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన సినిమాని ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉండగానే సంక్రాంతికి రిలీజ్ చేశారు. అంత హడావిడిగా రిలీజ్ చేస్తే క్వాలిటీ అవుట్ పుట్ ఎలా వస్తుంది ?

55
నా ప్రమేయం లేకుండానే తప్పులు
Image Credit : Asianet News

నా ప్రమేయం లేకుండానే తప్పులు

రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో నేను వేరే వర్క్ లో బిజీగా ఉన్నాను. అన్ని పనులు నేనే చూడడం కుదరదు. దీనితో దేవి వరప్రసాద్ గారే తన ఆధ్వర్యంలో భారీ సెట్ వేసి చివరి సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ కోసం అయన విచ్చలవిడిగా డబ్బు కుమ్మరించారు. సాంగ్ బావుండాలి అని హైడ్రాలిక్ మెషీన్స్ కూడా తెప్పించారు. ఇలాంటి తప్పులన్నీ నా ప్రమేయంతో జరగలేదు అని గుణశేఖర్ తెలిపారు. అయినప్పటికీ చిరంజీవి గారు, దేవి వరప్రసాద్ గారు ఇద్దరితో నాకు మంచి రిలేషన్ ఉంది అని గుణశేఖర్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Recommended image2
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image3
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Related Stories
Recommended image1
Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం
Recommended image2
Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved