MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sai Pallavi: సాయి పల్లవి చేతుల్లోంచి ఎగిరిపోయిన భారీ ప్రాజెక్ట్.. ఆ లక్కీ ఛాన్స్ రష్మికకే.. అసలు కారణమేంటి?

Sai Pallavi: సాయి పల్లవి చేతుల్లోంచి ఎగిరిపోయిన భారీ ప్రాజెక్ట్.. ఆ లక్కీ ఛాన్స్ రష్మికకే.. అసలు కారణమేంటి?

Sai Pallavi: భారతరత్న, సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాకు సంబంధించి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో సాయి పల్లవి స్థానంలో రష్మిక మందన్న నటిస్తోంది. ఎందుకు సాయి పల్లవి తప్పుకుంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 20 2026, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక
Image Credit : Asianet News

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా ఎంపికైంది. అల్లు అరవింద్ సమర్పణలో 'గీతా ఆర్ట్స్' బ్యానర్‌పై ఈ సినిమా తీస్తున్నారు. ఈ క్లాసిక్ రోల్ కోసం చిత్ర యూనిట్ రష్మికకు లుక్ టెస్ట్ నిర్వహించగా, అది పూర్తిగా సక్సెస్ అయింది. దీంతో ఆమెనే ఫైనల్ చేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని చెప్పవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సాయి పల్లవి ఎందుకు తప్పుకుంది?
Image Credit : chatgpt

సాయి పల్లవి ఎందుకు తప్పుకుంది?

నిజానికి ఈ బయోపిక్ ప్రాజెక్ట్ మొదట సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. మేకర్స్ మొదటి ఛాయిస్ కూడా ఆమే. అయితే, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రామాయణ'లో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ చాలా టైట్‌గా ఉండటం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సాయి పల్లవి వైదొలిగిన తర్వాత రుక్మిణి వసంత్ లాంటి నటీమణుల పేర్లను చిత్ర బృందం పరిశీలించింది. కానీ చివరకు రష్మిక మందన్న ఈ గోల్డెన్ ఆఫర్‌ను దక్కించుకుంది.

35
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటీనటుల మార్పులు
Image Credit : Asianet News

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటీనటుల మార్పులు

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ల కోసం నటీనటులు మారడం చాలా సాధారణం. బాలీవుడ్‌లో గతంలో జరిగిన కొన్ని పెద్ద మార్పులు ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేశాయి.

షోలే (1975): గబ్బర్ సింగ్ పాత్రకు మొదట డాని డెంజోంగ్పాను అనుకున్నారు. అఫ్గానిస్తాన్‌లో ఆయన షూటింగ్ బిజీ వల్ల తప్పుకోవడంతో అమ్జాద్ ఖాన్ ఆ రోల్ చేశారు. అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఐకానిక్ విలన్ క్యారెక్టర్‌గా నిలిచింది.

జంజీర్ (1973): ధర్మేంద్ర, దేవ్‌ ఆనంద్, రాజ్ కుమార్ ఈ కథను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌ దగ్గరకు ఈ రోల్ వెళ్లింది. ఆయనను యాంగ్రీ యంగ్ మేన్ గా మార్చి సూపర్‌స్టార్‌ను చేసింది.

దీవానా (1992): క్రియేటివ్ తేడాల వల్ల అర్మాన్ కోహ్లీ కొన్ని సీన్లు తీశాక సినిమా నుంచి వాకౌట్ చేశారు. ఆయన ప్లేస్‌లోకి షారుఖ్ ఖాన్ వచ్చి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

చల్తే చల్తే (2003): ఐశ్వర్యా రాయ్ కొన్ని సీన్లు షూట్ చేశాక సల్మాన్ ఖాన్ సెట్స్‌లో గొడవ చేయడంతో ఆమెను తీసేసి రాణి ముఖర్జీని తీసుకున్నారు.

ఫితూర్ (2016): రేఖ బేగం హజ్రత్ పాత్రలో కొన్ని సీన్లు చేశాక విభేదాల వల్ల తప్పుకోవడంతో టాబు ఆ పాత్ర పోషించారు.

45
సౌత్ సినిమాలోనూ ఇదే ట్రెండ్
Image Credit : Getty

సౌత్ సినిమాలోనూ ఇదే ట్రెండ్

సౌత్ ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి కీలక మార్పులు ఎన్నో జరిగాయి.

మణిరత్నం నాయకన్ (1987) లో పద్మిని కొల్హాపురే షూటింగ్‌కు రాకపోవడంతో కెమెరా అసిస్టెంట్‌గా ఉన్న సుహాసిని ఆ రోల్ చేశారు. అక్కడి నుంచే ఆమె గొప్ప నటిగా మారారు.

అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన 'లెనిన్' సినిమాలో శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా వచ్చింది. డేట్స్ సమస్యల వల్లే శ్రీలీల తప్పుకుంది.

విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ 'కింగ్‌డమ్'లో కూడా శ్రీలీల స్థానాన్ని భాగ్యశ్రీ బోర్సేనే భర్తీ చేయడం విశేషం.

'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల్లో పూజా హెగ్డే స్థానంలోకి శ్రీలీల వచ్చింది.

55
సందీప్ వంగా 'స్పిరిట్'లో తృప్తి డిమ్రి
Image Credit : others

సందీప్ వంగా 'స్పిరిట్'లో తృప్తి డిమ్రి

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న 'స్పిరిట్' సినిమాలోనూ పెద్ద మార్పే జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట దీపికా పడుకోణెతో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు ఫలించకపోవడంతో, చిత్రబృందం తృప్తి డిమ్రిని కథానాయికగా ఖరారు చేసింది. ఇలా డేట్స్ అడ్జస్ట్‌మెంట్స్, క్రియేటివ్ తేడాల వల్ల సినిమా ఇండస్ట్రీలో ప్రాజెక్టులు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారడం చాలా కామన్. ఇప్పుడు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ కూడా అలానే సాయి పల్లవి నుంచి రష్మిక మందన్న చేతికి వెళ్లింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dakkshi: కాస్టింగ్ కౌచ్ కష్టాలు దాటుకుని ఆర్జీవీ సినిమాలో ఛాన్స్.. బిగ్ బాస్ లోకి కరోనా వైరస్ బ్యూటీ దక్షి
Recommended image2
Shivakumar Marihal: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు, షాలినీకి ఇచ్చిపడేసిన శివకుమార్
Recommended image3
Rakul Preet Singh: రాంచరణ్ సినిమా నుంచి అజయ్ దేవగన్ మూవీ వరకు.. రకుల్ కెరీర్ లో టాప్ 10 బెస్ట్ రోల్స్ ఇవే
Related Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు, ఈ జిల్లాల్లో కుండపోతే
Recommended image2
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved