MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ

Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ

రోజా.. దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ప్రేమ విషయం తెలిసి చిరంజీవి బోల్డ్ కామెంట్‌ చేశాడట. తెలుగోళ్లు దొరకలేదా, ఆ అరవోన్ని ప్రేమించావంటూ చురకలంటించారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 20 2026, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి కామెంట్‌
Image Credit : Asianet News

రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి కామెంట్‌

నటి, మాజీ మంత్రి రోజా ఇప్పుడు మళ్లీ యాక్టింగ్‌ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆమె ఇప్పటికే జీ తెలుగులో షోస్‌ చేస్తోంది. మరోవైపు సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తికరంగానే ఉన్నట్టు వెల్లడించింది. చిరంజీవి, బాలయ్య వంటి వారితో కలిసి నటించాలని ఉందని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తన ప్రేమకి సంబంధించి చిరంజీవి చేసిన కామెంట్‌ని వెల్లడించింది. అంతేకాదు చిరంజీవికి ఆయన భార్య సురేఖ గట్టి కౌంటర్‌ కూడా ఇచ్చిందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మొదటి సినిమాతోనే సెల్వమణితో ప్రేమలో పడ్డ రోజా
Image Credit : youtube@zeecinemalu

మొదటి సినిమాతోనే సెల్వమణితో ప్రేమలో పడ్డ రోజా

రోజా చదువుకునే సమయంలోనే సినిమాలోకి వచ్చింది. ఆమె యాక్సిడెంటల్‌గానే హీరోయిన్‌ అయ్యింది. అయితే `చెమ్మరుతి` అనే చిత్రంతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సెల్వమణి దర్శకుడు. షూటింగ్‌ ప్రారంభంలోనే సెల్వమణి, రోజా ప్రేమలో పడ్డారట. ఆయన చూపించిన కేరింగ్‌, ప్రేమ, అప్యాయతకి రోజా ఫిదా అయ్యింది. దీంతో ప్రేమలో పడింది. అయితే ఆ తర్వాత ఈ విషయం చిరంజీవికి తెలిసిందట. దీంతో అప్పట్లో రోజా ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందట. రోజా కలిసినప్పుడు ఆమెకి పెద్ద షాక్‌ ఇచ్చారు చిరంజీవి. ఈ విషయాన్ని రోజానే వెల్లడించింది.

34
ప్రేమించడానికి తెలుగోళ్లు దొరకలేదా.. రోజాపై చిరు ఫైర్‌
Image Credit : Asianet News

ప్రేమించడానికి తెలుగోళ్లు దొరకలేదా.. రోజాపై చిరు ఫైర్‌

చిరంజీవి కలిసినప్పుడు ఏమ్మా.. ప్రేమించడానికి నీకు తెలుగోళ్లు ఎవరూ దొరకలేదా? పోయి పోయి ఆ అరవోన్ని ప్రేమించావని తిట్టాడట. చిరంజీవి సరదాగా తనని ఆటపట్టిస్తుంటాడని, ఆ సమయంలోనూ తన ప్రేమ విషయంలో చిరంజీవి బోల్డ్ గా కామెంట్‌ చేసినట్టు తెలిపింది రోజా. అయితే వెంటనే ఆయన భార్య సురేఖ కల్పించుకున్నారట. `మీకేంటి ప్రాబ్లం, ఆ పిల్లకి నచ్చారు, ఆయనకు ఆమె నచ్చారు. చిన్న పిల్లలకు అలా చెప్పకూడదు, వారి మైండ్‌ డైవర్ట్ అవుతుంది` అని సురేఖ.. చిరంజీవికి ఇచ్చిపడేసిందట. తాజాగా రోజా చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

44
యాక్టింగ్‌పై ఫోకస్‌ పెట్టిన రోజా
Image Credit : youtube@zeecinemalu

యాక్టింగ్‌పై ఫోకస్‌ పెట్టిన రోజా

రోజా ఫస్ట్ సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ సినిమా పోయింది. తర్వాత తన ఫ్యామిలీని సెట్‌ చేయాలనుకున్నారు. తన సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేయాలనుకుంది. అది షూటింగ్‌ డిలే అయ్యింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఆ నష్టాలను పూడ్చడం కోసం సినిమాలు చేయాల్సి వచ్చింది. ఇలా అనేక కారణాలతో వీరి లవ్‌ ట్రాక్‌ పదకొండేళ్లపాటు కొనసాగింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి కూతురు, కొడుకు జన్మించారు. రోజా.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించారు. పిల్లల కోసం కొంత గ్యాప్‌ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేశారు. క్యారెక్టర్స్ తో మెప్పించారు. అలాగే రాజకీయాల్లోకి వెళ్లారు. మొదట టీడీపీలో చేరారు. కానీ అందులో రెండు సార్లు ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో జాయిన్‌ అయ్యింది. వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యింది. రెండోసారి కూడా గెలిచి మంత్రి అయ్యింది. గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది రోజా. దీంతో మళ్లీ యాక్టింగ్‌ పై ఫోకస్‌ పెట్టింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?
Recommended image2
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Recommended image3
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు
Related Stories
Recommended image1
Maremma 10 Days Collections: నిర్మాతలను నిండా ముంచిన మారెమ్మ.. రవితేజ తమ్ముడి కొడుకు మూవీ టోటల్‌ కలెక్షన్లు
Recommended image2
Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved