MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?

Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?

యష్‌ హీరోగా రూపొందిన `టాక్సిక్‌` మూవీ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా సాలిడ్‌గా కలెక్షన్లని వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత రావాలనేది చూస్తే..

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 03 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్‌
Image Credit : X/@KvnProductions

భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్‌

రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా రూపొందిన `టాక్సిక్‌` మూవీ గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో నయనతార ఆయనకు అక్కగా నటించగా, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌, తారా సుతారియా హీరోయిన్లుగా చేశారు. హ్యూమా ఖురేషి మరో ముఖ్య పాత్ర పోషించింది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాంస్టర్‌ మూవీ మేకర్స్ పతాకంపై యష్‌, వెంకట్ కే నారాయణ నిర్మించారు. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెగటివ్‌ టాక్‌తోనూ టాక్సిక్‌కి సాలిడ్‌ కలెక్షన్లు
Image Credit : X/@KvnProductions

నెగటివ్‌ టాక్‌తోనూ టాక్సిక్‌కి సాలిడ్‌ కలెక్షన్లు

అయితే అంచనాలను అందుకోవడంలో `టాక్సిక్‌` వెనకబడింది. యాక్షన్‌, రొమాన్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. మొదటి రోజు ఊహించని వసూళ్లు కలెక్ట్ చేసింది. ఏకంగా రూ.140కోట్లు రాబట్టింది. నెగటివ్‌ టాక్‌ తోనూ ఈ స్థాయి కలెక్షన్లని రాబట్టడం మామూలు విషయం కాదు, ఇది యష్‌ రేంజ్‌కి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ తర్వాత నుంచి కలెక్షన్లు డ్రాప్‌ అయ్యాయి. అయితే నెగటివ్ టాక్ వచ్చిన మూవీ సోమవారం నుంచి కలెక్షన్లు పడిపోతాయి. కానీ ఈ చిత్రానికి ఇంకా సాలిడ్‌గా వస్తుండటం విశేషం.

34
టాక్సిక్‌ 8వ రోజు కలెక్షన్లు
Image Credit : X/@KvnProductions ·

టాక్సిక్‌ 8వ రోజు కలెక్షన్లు

`టాక్సిక్‌` మూవీ 8వ రోజు ఇండియాలో రూ.5.10కోట్ల నెట్‌ని రాబట్టింది. ఓవర్సీస్‌లో కోటి వరకు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.322కోట్లు రావడం విశేషం. ఇండియాలో దీనికి రూ.280.25కోట్ల గ్రాస్‌, రూ.234.70కోట్ల నెట్‌ వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ.41.75కోట్లు వసూలు చేసింది. లాంగ్‌ రన్‌లో మరో యాభై కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉంది. అంటే సుమారు ఈ మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు నాలుగు వందల కోట్ల వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజాస్టర్‌ టాక్‌తోనూ ఈ స్థాయికి కలెక్షన్లు రావడం విశేషంగా చెప్పొచ్చు.

44
టాక్సిక్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

మరి `టాక్సిక్‌` మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ ఎంత? ఎంత వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది? నిర్మాతలు, బయ్యర్లు సేఫ్‌ అవుతారనేది చూస్తే, ఇక `టాక్సిక్‌` మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ.105కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. ఇందులో నైజాంలో రూ.45కోట్లు, సీడెడ్‌లో రూ.15కోట్లు, ఆంధ్రాలో మరో రూ.45కోట్లు అయ్యిందని సమాచారం. కర్నాటకలో రూ.100కోట్లకు, తమిళనాడులో రూ.45కోట్లకు, కేరళాలో రూ.15కోట్లకు, నార్త్ లో రూ.75కోట్లకు, రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో రూ.15కోట్లకు అమ్మారట. ఓవర్సీస్‌ రైట్స్ మరో రూ.70కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా రూ.425కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. సినిమా హిట్‌ కావాలంటే రూ.850కోట్ల గ్రాస్‌ రాబట్టాలి. ఇప్పటి వరకు సుమారు రూ.160కోట్ల వరకు షేర్‌ వచ్చింది. ఇంకా రూ.265కోట్ల షేర్‌ రావాలి. అంటే ఐదు వందల కోట్ల వరకు గ్రాస్‌ రాబట్టాలి. అది కష్టమనే చెప్పాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
నయనతార
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved