MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..

Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..

Irumudi Movie Review: మాస్ మహారాజ రవితేజ ఫస్ట్ టైమ్ చేస్తోన్న భక్తిరస చిత్రం ఇరుముడి. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ ను రవితేజ ఎలా మెపించగలడనన అభిప్రాయాల మధ్య.. ఇరుముడి ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 19 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ఇరుముడి
Image Credit : IRUMUDI KATTU/ T-Series Telugu

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడమే కాకుండా, ఫిలిం వర్గాలు, సెన్సార్ టీమ్ నుంచి కూడా పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఊర మాస్ అభిమానులున్న రవితేజ.. భక్తి చిత్రంతో ఎలా మెప్పించగలడన్న డౌట్ చాలామందిలో ఉంది. కానీ ఈసినిమాతో ఆయన ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించబోతునట్టు తెలుస్తోంది. పలు నివేదికల ఆధారంగా రూపొందించిన 'ఇరుముడి' ఫస్ట్ రివ్యూ / సెన్సార్ టాక్ వివరాలు చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇరుముడి కథ విషయానికి వస్తే..
Image Credit : Asianet News

ఇరుముడి కథ విషయానికి వస్తే..

ఈ సినిమాలో రవితేజ ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి చెందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తారు. కథ బిగినింగ్ లో ఆయన పక్కా నెగెటీవ్ పాత్రలో కనిపిస్తారట. మందుకు బాగా అలవాటుపడిన పాత్రలో కనిపించే ఆయన, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప మాల ధరిస్తారు. మాల వేసుకున్న తర్వాత ఆయన జీవితంలో, ఆయన ప్రవర్తనలో వచ్చే మార్పుల ఏంటి? ఆ ఊరిలో మహిళల చుట్టూ అల్లుకున్న క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Related image2
Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?
35
ఇరుముడి రివ్యూ..
Image Credit : Asianet News

ఇరుముడి రివ్యూ..

గత సినిమాలకు పూర్తి భిన్నంగా రవితేజ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్న ఈసినిమాలో ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో అలరించినట్టు తెలుస్తోంది. స్వామి మాల ధరించిన తర్వాత ఆయన నటనలోని పరిణతి అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తండ్రి - కూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం. రవితేజ , ఆయన కూతురిగా నటించిన చిన్నారి (బేబీ నక్షత్ర) మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో (Second Half) వచ్చే సెంటిమెంట్ సీన్లకు ఫిదా అవ్వాల్సిందే. అంతే కాదు ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 25 నిమిషాలు మాత్రమే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవ్వబోతోంది. ఎక్కడా అనవసర సన్నివేశాలు లేకుండా స్క్రీన్ ప్లే స్పీడ్ గా ఆసక్తికరంగా సాగుతుంది.

45
సినిమాకు అతి పెద్ద బలం..
Image Credit : IRUMUDI KATTU/ T-Series Telugu

సినిమాకు అతి పెద్ద బలం..

జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన "ఇరుముడి కట్టు", "మల్లెపూల పల్లకి" వంటి పాటలు వైరల్ అవుతున్నాయి. మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈసినిమా మొత్తానికి ఈ రెండు పాటలు హైలెట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే శివ నిర్వాణ మార్క్ టేకింగ్ అందరికి తెలిసిందే. గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా చూపిస్తూనే, ఎమోషన్స్, సస్పెన్స్‌ని దర్శకుడు చక్కగా బ్యాలన్స్ (Balance) చేశారు.

55
నటీనటుల పనితీరు
Image Credit : Asianet News

నటీనటుల పనితీరు

ఈ సినిమాలో రవితేజ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు సపోర్ట్ గా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా తన పరిధి మేర ఆకట్టుకోగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వరుస ప్లాపులతో ఉన్న రవితేజకు 'ఇరుముడి' ఒక ఫర్ఫెక్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా నిలిచి, మంచి కంబ్యాక్ హిట్ ఇస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. సెన్సార్ రిపోర్ట్ తర్వాత మూవీ టీమ్ లో కూడా కాన్ఫిడెంట్ మరింతపెరిగినట్టు తెలుస్తోంది. సెంటిమెంట్, డ్రామా తో కూడిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడే కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా 21 అగస్ట్ న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
Malliswari Movie Review: చైనాలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా, తనకంటే 2 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్..
Recommended image3
JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Related Stories
Recommended image1
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved