- Home
- Entertainment
- ఎయిర్ పోర్టులో పూనమ్ బజ్వా కూల్ పిక్స్.. స్టైలిష్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ..
ఎయిర్ పోర్టులో పూనమ్ బజ్వా కూల్ పిక్స్.. స్టైలిష్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ..
ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. తన అభిమానులను ఖుషీ చేసేందుకు ఎప్పుడూ ఏదోక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది.

గ్లామర్ హీరోయిన్ పూనమ్ బజ్వా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా హడావుడి చేస్తోంది. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గానే ఉంటూ తన అభిమానులు, ఫాలోవర్స్ ను పలకరిస్తూ ఉంటుంది. ఇటీవల పూనమ్ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ కనువిందుచేస్తోంది.
ముఖ్యంగా నెట్టింట పూనమ్ అందాల ఆరబోత నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. ఒక్కోసారి ఒక్కో విధంగా దర్శనమిస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. ఈ గ్లామర్ బ్యూటీ అందాల ధాటికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
తాజాగా పూనమ్ కొన్ని పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ ను ఆమె ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారు. మరికొందరు పూనమ్ బజ్వా గ్లామర్ ను పొగుడుతూ కామెంట్లు సైతం పెడుతున్నారు.
తను షేర్ చేసుకున్న పిక్స్ లో పూనమ్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ట్రెండీ వేర్ లో ఫొటోలకు స్టైలిష్ గా పోజులిచ్చింది. గాగూల్స్ ధరించి, చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మతిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ తెలంగాణ ఫార్మేషన్ డేను గుర్తుచేస్తూ ‘లవ్ జూన్ 2’అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
పూనమ్ తెలుగులో కింగ్ నాగార్జున నటించిన చిత్రం ‘బాస్’లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. తన గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత వేడుక, పరుగు చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు పెద్దగా హిట్ కాకపోవడంతో పూనమ్ కు కూడా తగిన గుర్తింపు దక్కలేదు.
దీంతో ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లోనే నటిస్తోందీ బ్యూటీ. చివరిగా ‘కుప్పత్ రాజా’ తమిళ మూవీలో మెరిసింది. ప్రస్తుతం ‘పాథోన్పథం నూట్టండు, మే హూమ్ మూసా’ వంటి మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.