MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

India WTC Final Qualification Scenario: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ చేరేందుకు భారత్‌కు ఇంకా 8 టెస్టులు మిగిలి ఉన్నాయి. ద ఓవల్ చేరుకోవడానికి టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 21 2026, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డూ ఆర్ డై: భారత్‌కు మిగిలిన 8 టెస్టులు
Image Credit : ANI

డూ ఆర్ డై: భారత్‌కు మిగిలిన 8 టెస్టులు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ రేస్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తం 27 టెస్ట్ సిరీస్‌లలో ఇంకా 15 సిరీస్‌లు మిగిలి ఉన్నాయి. 2027 జూన్ 9 నుంచి 13 వరకు లండన్‌లోని 'ద ఓవల్' లో జరగనున్న టైటిల్ పోరుపైనే అన్ని జట్లు కన్నేశాయి. గత రెండు సైకిళ్ల లెక్కలు చూస్తే, ఏ జట్టు అయినా ఫైనల్ చేరాలంటే కనీసం 60% నుంచి 65% పాయింట్ల శాతం సాధించాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్రీలంక టూర్ విజయంతో మారిన సమీకరణాలు
Image Credit : ANI

శ్రీలంక టూర్ విజయంతో మారిన సమీకరణాలు

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. గాలేలో జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల శాతంలో కాస్త మెరుగైంది. గత ఏడాది సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోవడంతో భారత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి భారత్ దాదాపు అవుట్ అయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మళ్లీ అవకాశం దక్కింది.

Related Articles

Related image1
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Related image2
Bananas: సూపర్‌మార్కెట్‌లో 10 రోజులు ఉండే అరటిపండ్లు.. ఇంట్లో 2 రోజులకే ఎందుకు పాడవుతాయి? సీక్రెట్ హ్యాక్స్ ఇవే
35
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ పరిస్థితి ఏంటి?
Image Credit : ANI

పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ పరిస్థితి ఏంటి?

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత భారత్ పీసీటీలు పెగిగింది. ఇప్పటివరకు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడింది. అందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా చేతిలో రెండు, ఇంగ్లాండ్‌ చేతిలో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

45
ముందున్న మ్యాచులు: ఫైనల్ బాట ఎంత కష్టం?
Image Credit : ANI

ముందున్న మ్యాచులు: ఫైనల్ బాట ఎంత కష్టం?

భారత్‌కు ప్రస్తుతం శ్రీలంకతో ఆడాల్సిన రెండో టెస్టుతో కలిపి మొత్తం 8 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 2 టెస్టులు ఆడుతుంది. అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. భారత్‌కు ఇప్పుడు ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఫైనల్ చేరేందుకు కావాల్సిన 60% PCT సాధించాలంటే, మిగిలిన 8 టెస్టుల్లో భారత్ కనీసం 7 మ్యాచ్‌లు (84 పాయింట్లు) గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిస్తే, మరో 2 మ్యాచ్‌లను కచ్చితంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

55
ఆస్ట్రేలియాతో సిరీసే అసలైన సవాల్
Image Credit : ANI

ఆస్ట్రేలియాతో సిరీసే అసలైన సవాల్

గిల్ సేనకు ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్ అతిపెద్ద సవాలుగా మారనుంది. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను వారి సొంతగడ్డపైనే ఓడిస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు భారత్‌కు పూర్తిగా మూసుకుపోతాయి. మరోవైపు, ఆస్ట్రేలియా ప్రస్తుతం 77.78% PCTతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఇంకా 13 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, భారత్‌లతో ఆస్ట్రేలియా సిరీస్‌లు ఆడనుంది. ఆసీస్ మిగిలిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 6 గెలిచినా ఫైనల్ చేరడం దాదాపు ఖాయమే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Related Stories
Recommended image1
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image2
Bananas: సూపర్‌మార్కెట్‌లో 10 రోజులు ఉండే అరటిపండ్లు.. ఇంట్లో 2 రోజులకే ఎందుకు పాడవుతాయి? సీక్రెట్ హ్యాక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved