MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?

T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?

T20 Cricket Centuries: టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 7 బ్యాటర్ల లిస్ట్ లో ఇద్దరు భారత ప్లేయర్లు ఉన్నారు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ సహా ఈ జాబితాలో ఉన్న ప్లేయర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 03 2026, 12:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీ20 ఫార్మాట్‌లో పరుగుల సునామీ: మోస్ట్ సెంచరీల రికార్డ్స్
Image Credit : bcci

టీ20 ఫార్మాట్‌లో పరుగుల సునామీ: మోస్ట్ సెంచరీల రికార్డ్స్

పొట్టి ఫార్మాట్ అని పిలిచే టీ20 క్రికెట్‌లో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. పరిమిత ఓవర్లు, తీవ్రమైన ఒత్తిడి మధ్య వంద పరుగులు పూర్తి చేయడం బాటన్స్‌కు పెద్ద సవాల్. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో కొందరు బ్యాటర్లు మైదానంలో విరుచుకుపడుతూ వరుసగా సెంచరీలు బాదారు. ప్రపంచ టీ20 లీగ్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచులలో అత్యధికంగా సెంచరీలు చేసిన టాప్ 7 బ్యాటర్ల రికార్డులను ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డ్: ఫస్ట్ ప్లేస్‌లో యూనివర్సల్ బాస్
Image Credit : Getty

క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డ్: ఫస్ట్ ప్లేస్‌లో యూనివర్సల్ బాస్

టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో ఏకంగా 22 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. తన కెరీర్‌లో మొత్తం 463 టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ 14,562 పరుగులు చేశారు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించడంలో గేల్ తనదైన ముద్ర వేశాడు. అందుకే ఈ ఫార్మాట్‌లో ఇప్పటికీ మోస్ట్ సెంచరీల వరల్డ్ రికార్డు గేల్ పేరిటే పదిలంగా ఉంది.

36
సెకండ్ ప్లేస్‌లో పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజమ్
Image Credit : Getty

సెకండ్ ప్లేస్‌లో పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజమ్

అత్యధిక సెంచరీల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉన్నారు. తన నిలకడైన బ్యాటింగ్‌తో సుదీర్ఘ కాలంగా పరుగులు సాధిస్తున్న బాబర్, టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 13 సెంచరీలు సాధించారు. మొత్తం 359 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ 12,493 పరుగులు చేసి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. తక్కువ మ్యాచుల్లోనే అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో బాబర్ ఒకరిగా నిలిచారు.

46
కోహ్లీ, వార్నర్, డికాక్ హోరాహోరీ: పదేసి సెంచరీలతో ముగ్గురు స్టార్లు
Image Credit : ANI

కోహ్లీ, వార్నర్, డికాక్ హోరాహోరీ: పదేసి సెంచరీలతో ముగ్గురు స్టార్లు

టీ20 క్రికెట్‌లో పదేసి సెంచరీలతో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 430 టీ20 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలు సాధించారు. కోహ్లీ మొత్తం 14,218 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 10 సెంచరీలతో సమానంగా ఉన్నారు. వార్నర్ 439 మ్యాచుల్లో 14,284 పరుగులు చేశారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్ కింటన్ డికాక్ ఇటీవల క్యారీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026 లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడుతూ తన 10వ టీ20 సెంచరీని బాదారు. డికాక్ ఇప్పటివరకు 457 టీ20 మ్యాచుల్లో 12,867 పరుగులు సాధించారు.

56
సాహిబ్‌జాదా ఫర్హాన్ తుఫాన్ ఫామ్: తక్కువ మ్యాచుల్లోనే 9 సెంచరీలు
Image Credit : Getty

సాహిబ్‌జాదా ఫర్హాన్ తుఫాన్ ఫామ్: తక్కువ మ్యాచుల్లోనే 9 సెంచరీలు

పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అత్యంత వేగంగా సెంచరీలు బాది ఈ జాబితాలో ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం 181 టీ20 మ్యాచ్‌లలోనే ఫర్హాత్ 9 సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. అతి తక్కువ మ్యాచ్‌లలో ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాత్ మొత్తం 5,526 పరుగులు చేశారు.

66
అభిషేక్ శర్మ రికార్డుల వేట: ఏడో స్థానంలో టీమిండియా యంగ్ స్టార్
Image Credit : X/BCCI

అభిషేక్ శర్మ రికార్డుల వేట: ఏడో స్థానంలో టీమిండియా యంగ్ స్టార్

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 206 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 9 సెంచరీలు బాది ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. మొత్తం 5,995 పరుగులు చేసి తన నిలకడను నిరూపించుకున్నారు. యంగ్ ఏజ్‌లోనే ఈ రేంజ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved