MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?

Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?

Gold Price crash: బంగారం కొనాలనుకుంటున్న వారికి మార్కెట్‌ కాస్త ఊరటనిచ్చింది. కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు..మరోసారి దిగొచ్చాయి. వారం ప్రారంభంలోనే బంగారం, వెండి రేట్లు స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 07 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ధరలకు బ్రేక్
Image Credit : chatgpt

పసిడి ధరలకు బ్రేక్

బంగారం ధరలు కొంతకాలంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో కదలికలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం ప్రారంభంలోనే దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 మేర దిగివచ్చింది. 22 క్యారెట్ల రేటు రూ.600, 18 క్యారెట్ల ధర రూ.490 మేర తగ్గింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,52,860కు చేరిన బంగారం
Image Credit : Getty

రూ.1,52,860కు చేరిన బంగారం

హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,860గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,40,122 వద్ద ఉంది. వెండి ధర కిలోకు రూ.2,36,520గా కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,640, 22 క్యారెట్లు రూ.1,39,920గా ఉండగా.. బెంగళూరులో ఇవి వరుసగా రూ.1,52,760, రూ.1,40,030గా నమోదయ్యాయి. చెన్నైలో 24 క్యారెట్ల రేటు రూ.1,53,060, 22 క్యారెట్ల ధర రూ.1,40,305గా ఉంది.

Related Articles

Related image1
Now Playing
Gold Price Today: పసిడి ధరలు ఢమాల్.. కొనుగోలుదారులకు భారీ ఊరట..ఇంత తగ్గడానికి కారణమేంటి?
Related image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
34
చల్లారని యుద్ధ మంటలు
Image Credit : Getty

చల్లారని యుద్ధ మంటలు

అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం వల్ల గోల్డ్ ధరల్లో కొంత బలహీనత కనిపిస్తోంది. అమెరికా ఉపాధి రంగానికి సంబంధించిన తాజా గణాంకాలు వెలువడిన నేపథ్యంలో మార్కెట్లు ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై అంచనాలు వేసుకుంటున్నాయి. వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత లేకపోవడం కూడా బంగారం ధరల్లో ఊగిసలాటకు కారణమవుతోంది. అదే సమయంలో అమెరికా-ఇరాన్ చుట్టూ కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలను కూడా మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.

44
రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లలో మళ్లీ మార్పులు
Image Credit : Getty

రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లలో మళ్లీ మార్పులు

వరుసగా కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు మరింత తగ్గుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బంగారం ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో ఈ పతనం ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పడం కష్టం. డాలర్ కదలికలు, ఫెడ్ నిర్ణయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొనే భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లలో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Now Playing
Gold Price Today: పసిడి ధరలు ఢమాల్.. కొనుగోలుదారులకు భారీ ఊరట..ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved