- Home
- Business
- Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Gold Rate Crash: బంగారం కొనాలనుకునే వారికి బిగ్ రిలీఫ్! వరుసగా పెరుగుతూ చుక్కలు చూపించిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1,800కుపైగా తగ్గింది. ఇంతకీ ఈ పతనానికి కారణమేంటి? ఇప్పుడు కొనేస్తే మంచిదేనా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం రేట్లు భారీగా దిగొచ్చాయి. దీంతో కొద్ది రోజులుగా ధరల పెరుగుదలతో ఆందోళన చెందిన కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది.
రూ.1,54,800గా నమోదైన పసిడి
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాములపై ఏకంగా రూ.1,860 మేర తగ్గడంతో.. ప్రస్తుతం రూ.1,54,800గా నమోదైంది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాములపై రూ.1,700 తగ్గడంతో.. రూ.1,41,900 వద్ద కొనసాగుతోంది. అంటే రెండు రోజుల్లో వరుసగా పెరిగిన రేట్లతో పోలిస్తే ఇవాళ వచ్చిన తగ్గుదల కొనుగోలుదారులకు గణనీయమైన ఊరటనిచ్చింది.b అయితే హైదరాబాద్‌లో నమోదైన ఈ ధరలకు ఆభరణాల షాపుల్లో చెల్లించే తుది ధరకు తేడా ఉంటుంది. ఎందుకంటే బంగారం కొనుగోలుపై 3 శాతం జీఎస్టీతో పాటు ఆభరణాల డిజైన్‌ను బట్టి మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి రేట్లలో స్వల్ప మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది.
స్థిరంగా కొనసాగుతున్న వెండి
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారంతో పోలిస్తే సిల్వర్ మార్కెట్‌లో పెద్దగా కదలిక కనిపించలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. అంటే ఇవాళ వెండి రేటులో చెప్పుకోదగ్గ మార్పు లేకుండా స్థిరంగా ఉంది.
అందుకే ధరలు తగ్గుతున్నాయి!
అసలు బంగారం ధరలు ఒక్కరోజులో ఇంతలా ఎందుకు తగ్గాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలం పుంజుకోవడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం బంగారంపై ఒత్తిడిని పెంచాయి. అంతేకాకుండా ఇటీవల ధరలు గణనీయంగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు బంగారాన్ని విక్రయించడం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది.
బంగారం మళ్లీ పెరుగుతుందా?
సాధారణంగా డాలర్ బలపడితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోలు ఇతర కరెన్సీల్లో ఉన్న ఇన్వెస్టర్లకు ఖరీదుగా మారుతుంది. దీంతో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. మరోవైపు అమెరికా బాండ్లపై రాబడులు పెరిగితే.. వడ్డీ ఆదాయం ఇచ్చే పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలన్నీ కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో.. బంగారం ధరలు మళ్లీ పైకి వెళ్లే అవకాశం ఉందా? లేక మరికొంత కాలం తగ్గుదల కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అందుకే ప్రస్తుత తగ్గుదల కనిపించగానే మొత్తం కొనుగోలును ఒకేసారి చేయకుండా.. మార్కెట్ కదలికలను గమనించి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిదని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

