MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Gold Price Crash: బంగారం ధరలపై దిగుమతి సుంకం ఎఫెక్ట్...దిగొచ్చిన పసిడి

Gold Price Crash: బంగారం ధరలపై దిగుమతి సుంకం ఎఫెక్ట్...దిగొచ్చిన పసిడి

Gold Price Crash: బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్న వేళ.. ఇప్పుడు కాస్త ఊరటనిస్తున్నాయి. పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. కేంద్రం బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గించే అంశం పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 27 2026, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట
Image Credit : ChatGPT

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట

అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు, అమెరికా డాలర్ విలువలో మార్పులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం కూడా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దీంతో అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దిగొచ్చిన పసిడి
Image Credit : Pixabay

దిగొచ్చిన పసిడి

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,980గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.770 తగ్గింది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,400గా నమోదైంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.700 తగ్గింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలు ప్రస్తుతం పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

Related Articles

Related image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Related image2
Gold Price Crash: బంగారం ధరలో ఊహించని ట్విస్ట్.. కుప్పకూలిన పసిడి రేటు..కానీ!
33
దిగుమతి సుంకం తగ్గనుందా?
Image Credit : Pixabay

దిగుమతి సుంకం తగ్గనుందా?

ఇదిలా ఉంటే.. దేశీయంగా బంగారం ధరలను ప్రభావితం చేసే మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. బంగారం, వెండిపై ప్రస్తుతం 15 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బులియన్ వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు ఈ సుంకాన్ని తిరిగి 6 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. అధిక సుంకాల కారణంగా అధికారిక దిగుమతులు ఖరీదవుతున్నాయని, దీంతో అక్రమ మార్గాల్లో బంగారం దేశంలోకి వచ్చే అవకాశం పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సుంకాన్ని తగ్గిస్తే అక్రమ రవాణాకు ప్రోత్సాహం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే దేశీయంగా బంగారం ధరలకు మరింత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే ధరలు ఎంత మేరకు తగ్గుతాయనేది అంతర్జాతీయ బంగారం ధర, రూపాయి-డాలర్ మారకం విలువ, అమెరికా ఫెడ్ నిర్ణయాలు వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,62,980 వద్ద ఉన్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటు కేంద్రం తీసుకునే నిర్ణయంపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image2
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Recommended image3
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Related Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Gold Price Crash: బంగారం ధరలో ఊహించని ట్విస్ట్.. కుప్పకూలిన పసిడి రేటు..కానీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved