MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Gold Price Crash: బంగారం ధరలో ఊహించని ట్విస్ట్.. కుప్పకూలిన పసిడి రేటు..కానీ!

Gold Price Crash: బంగారం ధరలో ఊహించని ట్విస్ట్.. కుప్పకూలిన పసిడి రేటు..కానీ!

Gold Price Crash: దేశంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న వేళ.. మంగళవారం కాస్త ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు స్వల్పంగా తగ్గాయి. తగ్గుదల నామమాత్రంగానే ఉండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి పెద్దగా ఊరట లభించలేదు.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 25 2026, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెరిగింది కానీ...
Image Credit : vaibhav jewellers

పెరిగింది కానీ...

ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినా పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే తగ్గింది ఏ రూ.వెయ్యో, రూ.2వేలో కాదు...రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికీ రూ.1.63 లక్షల పైమాటే పలుకుతోంది. దేశీయ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,750గా నమోదైంది. సోమవారం రేటుతో పోలిస్తే రూ.220 తగ్గింది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,50,100గా ఉంది. ఇది రూ.200 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.120 తగ్గి రూ.1,22,810 వద్ద కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హైదరాబాద్‌లో బంగారం ధరలు
Image Credit : Asianet News

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,750గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,50,100, 18 క్యారెట్ల బంగారం రూ.1,22,810గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,63,750గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,50,100, 18 క్యారెట్ల ధర రూ.1,27,800గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,63,750, 22 క్యారెట్లు రూ.1,50,100, 18 క్యారెట్లు రూ.1,22,810గా కొనసాగుతున్నాయి.

34
అమెరికా మరిన్ని ఆంక్షలు
Image Credit : iSTOCK

అమెరికా మరిన్ని ఆంక్షలు

అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరిచేయాలనే ఉద్దేశంతో అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలను ప్రకటించింది. టెహ్రాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. అమెరికా ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమపై వచ్చే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదేహ్ తెలిపారు. అమెరికా విధించిన తాజా ఆంక్షలు తమ దేశాన్ని లొంగదీయలేవని స్పష్టం చేశారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ కూడా అమెరికా చర్యలపై స్పందించారు. తమ దేశంతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న భాగస్వాములు అమెరికా ఒత్తిడికి తలొగ్గరని పేర్కొన్నారు. ఇరాన్‌కు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను తెంచే స్థాయిలో అమెరికా లేదని వ్యాఖ్యానించారు.

44
బంగారంపై అంతర్జాతీయ ప్రభావం
Image Credit : pexels

బంగారంపై అంతర్జాతీయ ప్రభావం

ప్రస్తుతం బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ.. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితే పసిడికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం అయితే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపవచ్చు. దీంతో ప్రస్తుత తగ్గుదల తాత్కాలికమేనా? లేక మరింత కరెక్షన్ కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొనుగోలుదారులు మాత్రం ధరలు మరింత తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image2
పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షాక్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved