MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !

ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !

John Ternus vs Sundar Pichai: టెక్ దిగ్గజ సంస్థలైన ఆపిల్, గూగుల్ బాస్ ల జీతభత్యాలు, ఆస్తుల వివరాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టర్నస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాలు, నెట్ వర్త్ వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 03 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆపిల్ కొత్త సీఈఓగా జాన్ టర్నస్
Image Credit : Chatgpt

ఆపిల్ కొత్త సీఈఓగా జాన్ టర్నస్

ఆపిల్ సంస్థ కొత్త సీఈఓగా జాన్ టర్నస్ సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆపిల్ సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ స్థానంలో ఆయన ఈ పగ్గాలు చేపట్టారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాన్ టర్నస్ కొత్త పే-ప్యాకేజ్ వివరాలను ఆపిల్ కంపెనీ అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆపిల్ కొత్త సీఈఓ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శాలరీల మధ్య పోలిక ఆసక్తికరంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జాన్ టర్నస్ శాలరీ ప్యాకేజ్ వివరాలు
Image Credit : Apple Newsroom

జాన్ టర్నస్ శాలరీ ప్యాకేజ్ వివరాలు

ఆపిల్ SEC ఫైలింగ్ ప్రకారం జాన్ టర్నస్ ఇయర్ బేసిక్ శాలరీ 30 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. మన భారతీయ రూపాయిల్లో ఇది ఏటా రూ. 28.5 కోట్లు కాగా, నెలకు దాదాపు రూ. 2.37 కోట్లు వస్తుంది. అయితే టర్నస్ అసలు సంపాదన కేవలం బేస్ శాలరీ తో ముగిసిపోదు. ఆపిల్ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2027 కోసం ఆయనకు 5.5 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 522.5 కోట్ల టార్గెట్ ఈక్విటీ అవార్డును ఖరారు చేసింది. ఈ రెండింటినీ కలిపితే ఆయన టార్గెట్ కాంపెన్సేషన్ ఏకంగా 5.8 కోట్ల డాలర్లు అంటే రూ. 551 కోట్లుగా ఉంటుంది.

35
సుందర్ పిచాయ్ బేస్ శాలరీ ఎంత?
Image Credit : Getty

సుందర్ పిచాయ్ బేస్ శాలరీ ఎంత?

ఆల్ఫాబెట్ 2026 SEC ఫైలింగ్ ప్రకారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్షిక బేస్ శాలరీ 20 లక్షల డాలర్లు. భారతీయ కరెన్సీలో ఇది సంవత్సరానికి రూ. 19 కోట్లు కాగా, నెలకు రూ. 1.58 కోట్లుగా ఉంటుంది. 2020 నుంచి పిచాయ్ బేస్ శాలరీలో ఎలాంటి మార్పు లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పిచాయ్‌కు ఎలాంటి వార్షిక బోనస్ పొందే అర్హత లేదు. 2025లో సుందర్ పిచాయ్ మొత్తం కాంపెన్సేషన్ 10.91 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 103.6 కోట్లుగా ఉంది. ఇందులో రూ. 20.08 లక్షల డాలర్ల శాలరీ తో పాటు రూ. 88.98 లక్షల డాలర్ల ఇతర కాంపెన్సేషన్ ఉంది.

45
మొత్తం కాంపెన్సేషన్‌లో ఎవరిది పైచేయి?
Image Credit : IG

మొత్తం కాంపెన్సేషన్‌లో ఎవరిది పైచేయి?

కేవలం బేస్ శాలరీని చూస్తే జాన్ టర్నస్ స్పష్టంగా ముందున్నారు. ఆయన వార్షిక ప్రాథమిక వేతనం పిచాయ్ కంటే రూ. 10 కోట్లు ఎక్కువ. టోటల్ కాంపెన్సేషన్‌లో చూసుకున్నా ఆపిల్ నిర్దేశించిన రూ. 551 కోట్ల టార్గెట్ ప్యాకేజ్ వల్ల టర్నస్ ముందంజలో ఉన్నారు. అయితే టర్నస్ పొందే 55 మిలియన్ డాలర్ల ఈక్విటీ అవార్డులో 75 శాతం పర్ఫార్మెన్స్ ఆధారిత RSUలు ఉంటాయి. అంటే ఆపిల్ షేర్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఆయనకు అధిక భాగం అందుతుంది. మిగిలిన 25 శాతం టైమ్-బేస్డ్ RSUలుగా నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తారు. ఇవి కాకుండా 2026 ఆర్థిక సంవత్సరానికి టర్నస్‌కు దాదాపు 25 లక్షల డాలర్లు (రూ. 23.75 కోట్లు) ప్రో-రేటెడ్ RSU అవార్డు కూడా దక్కుతుంది.

55
నెట్‌వర్త్ విషయంలో ఎవరు ధనవంతుడు?
Image Credit : Instagram/Sundar Pichai

నెట్‌వర్త్ విషయంలో ఎవరు ధనవంతుడు?

జీతంలో టర్నస్ ముందున్నా, మొత్తం నెట్‌వర్త్ చూస్తే మాత్రం సుందర్ పిచాయ్ చాలా ముందంజలో ఉన్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం 1 సెప్టెంబర్ 2026 నాటికి సుందర్ పిచాయ్ అంచనా నెట్‌వర్త్ 1.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 15,200 కోట్లు. మరోవైపు జాన్ టర్నస్ నెట్‌వర్త్ గురించిన అధికారిక రిపోర్టులు బయటకు రాలేదు. సెలబ్రిటీ నెట్‌వర్త్, ఇతర బిజినెస్ రిపోర్టుల ప్రకారం ఆయన ఆస్తి సుమారు 7.5 కోట్ల డాలర్లు అంటే రూ. 712 కోట్లుగా అంచనా వేశారు. బేస్ శాలరీ, కాంపెన్సేషన్‌లో జాన్ టర్నస్ భారీ ప్యాకేజ్ కలిగి ఉన్నప్పటికీ, మొత్తం ఆస్తుల పరంగా మాత్రం సుందర్ పిచాయ్ చాలా ఎత్తులో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Recommended image2
బాగా ఉన్నోళ్లే కాదు మ‌నం కూడా డిష్ వాషర్ కొనుక్కోవచ్చు.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫ‌ర్
Recommended image3
Inspiring Story: అమ్మమ్మ జ్ఞాపకాలతో మొదలైన వ్యాపారం..ఇప్పుడు రూ.580 కోట్ల బ్రాండ్
Related Stories
Recommended image1
Primary School Age In USA: అమెరికాలో పిల్లలు ఏ వయసులో బడికి వెళ్తారో తెలుసా?
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved