MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Automobile
  • Bikes
  • రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ

రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ

Ola S1Z: ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ S1Zను విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో కంపెనీ స్వదేశీంగా అభివృద్ధి చేసిన భార‌త్ సెల్ ఎల్ఈపీ బ్యాట‌రీ టెక్నాల‌జీని ఉప‌యోగించారు. ఈ స్కూటీ ధ‌ర ఎంత‌.? ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు..

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 28 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండు బ్యాటరీ వేరియంట్లలో
Image Credit : Bhavish Aggarwal/X

రెండు బ్యాటరీ వేరియంట్లలో

ఓలా ఎస్‌1జెడ్‌ను 3.1 kWh, 5.1 kWh అనే రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.79,999, రూ.99,999గా ఉన్నాయి. 3.1 kWh బ్యాటరీతో కూడిన వేరియంట్ IDC ప్రకారం గరిష్ఠంగా 179 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. ఇక 5.1 kWh బ్యాటరీ వేరియంట్ గరిష్ఠంగా 301 కి.మీల‌ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేడ్ ఇన్ ఇండియా భార‌త్ సెల్ ఎల్ఈపీ టెక్నాల‌జీ
Image Credit : Bhavish Aggarwal/X

మేడ్ ఇన్ ఇండియా భార‌త్ సెల్ ఎల్ఈపీ టెక్నాల‌జీ

S1Zలో ఉపయోగించిన ప్రత్యేకతల్లో భార‌త్ సెల్ ఎల్ఈపీ టెక్నాల‌జీ ప్ర‌ధాన‌మైంది. ఈ 46-సిరీస్ LFP సెల్ ప్లాట్‌ఫామ్‌ను ఓలా ఎల‌క్ట్రిక్ స్వ‌యంగా అభివృద్ధి చేసింది. కంపెనీ బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి, ఓలా గిగాఫ్యాక్ట‌రీలో తయారు చేస్తున్నట్లు తెలిపింది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనంలో అత్యంత ఖరీదైన భాగాల్లో ఒకటి. సెల్స్‌ను సొంతంగా తయారు చేయడం ద్వారా బ్యాటరీ ఖర్చును తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది. LFP బ్యాటరీ కెమిస్ట్రీతో భద్రత, ఎక్కువ కాలం ఉపయోగించే సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉంటాయని ఓలా ఎల‌క్ట్రిక్‌ తెలిపింది. తక్కువ ధరలో అధునాతన బ్యాటరీ టెక్నాలజీని అందించడమే S1Z లక్ష్యమని పేర్కొంది.

35
ఫీచర్ల విషయంలోనూ తగ్గేదేలే..
Image Credit : Bhavish Aggarwal/X

ఫీచర్ల విషయంలోనూ తగ్గేదేలే..

S1Zలో MoveOS 5 సాఫ్ట్‌వేర్‌ను అందించారు. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, జియో-ఫెన్సింగ్, టైమ్-ఫెన్సింగ్, మోడ్-ఫెన్సింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. రైడ్ స్టాటిస్టిక్స్, ఎనర్జీ వినియోగ వివరాలను ఓలా ఎల‌క్ట్రిక్‌ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈజీ పార్క్ అనే ఫీచర్ కూడా S1Zలో ఉంది. ఇరుకైన ప్రదేశాల్లో స్కూటర్‌ను పార్క్ చేయడం, బయటకు తీసుకురావడం సులభంగా ఉండేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు.

45
నాలుగు రంగుల్లో లభ్యం
Image Credit : Bhavish Aggarwal/X

నాలుగు రంగుల్లో లభ్యం

Ola S1Zను వైట్, ఆంత్రాసైట్, స్కై స్ప్లాష్ బ్లూ, మాచా గ్రీన్ వంటి 4 రంగుల్లో తీసుకొచ్చారు. అన్ని వేరియంట్లలో 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. ధరను అందుబాటులో ఉంచడంతో దేశంలోని పెద్ద ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల విభాగాన్ని S1Z ద్వారా టార్గెట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, భద్రత, పనితీరు విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరలో స్కూటర్‌ను అందించడమే తమ ఉద్దేశమని పేర్కొంది.

55
ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి రానున్నాయి
Image Credit : Bhavish Aggarwal/X

ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి రానున్నాయి

ఓలా ఎస్‌1జెడ్‌లోని 3.1 kWh వేరియంట్ డెలివరీలు డిసెంబర్ 2026లో ప్రారంభం కానున్నాయి. ఇక 5.1 kWh వేరియంట్ డెలివరీలు మార్చి 2027లో మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఓలా ఉత్పత్తులను మరింత ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు కంపెనీ తన రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇందులో కంపెనీ సొంత స్టోర్లతో పాటు తొలిసారిగా డీలర్ ఆధారిత స్టోర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Recommended image3
Yamaha R2 : R15 కి బాప్ లాంటి బైక్ వచ్చేసింది.. KTM కి గట్టి కాంపిటీషన్.. యామహా R2 గ్రాండ్ ఎంట్రీ !
Related Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved