MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు, ఈ జిల్లాల్లో కుండపోతే

Weather Update: ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు, ఈ జిల్లాల్లో కుండపోతే

Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజులు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పలు ప్రాాంతాలకు అలర్ట్ ప్రకటించింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 20 2026, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాలను మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు
Image Credit : Gemini

తెలుగు రాష్ట్రాలను మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగైదు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అల్పపీడనం నుంచి వాయుగుండంగా.. ఏపీ తీరం వైపు పయనం
Image Credit : Asianet News

అల్పపీడనం నుంచి వాయుగుండంగా.. ఏపీ తీరం వైపు పయనం

ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మంగళవారానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ తీవ్ర వాయుగుండం బుధవారం (సెప్టెంబర్ 23) ఉదయానికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుని తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఉత్తర కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు, అలాగే మధ్య బంగాళాఖాతం మీదుగా మరో రెండు ద్రోణులు విస్తరించి ఉన్నందున వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

36
ఏపీలో అలర్ట్.. శ్రీకాకుళంలో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్
Image Credit : Gemini

ఏపీలో అలర్ట్.. శ్రీకాకుళంలో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్

అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

• ఎల్లో అలర్ట్ జిల్లాలు: ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.

• ప్రత్యేక చర్యలు: శ్రీకాకుళం జిల్లాలో ముందస్తు జాగ్రత్తగా అధికారుల సెలవులను రద్దు చేశారు. 11 తీరప్రాంత మండలాలకు సీనియర్ అధికారులను ఇంచార్జీలుగా నియమించారు. తుపాను పునరావాస కేంద్రాల్లో నీరు, బియ్యం సిద్ధం చేస్తున్నారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (08942 240557) ఏర్పాటు చేశారు.

• మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున సెప్టెంబర్ 25 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే వేటలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.

46
తెలంగాణలో మళ్లీ కుండపోత
Image Credit : Gemini AI

తెలంగాణలో మళ్లీ కుండపోత

తెలంగాణలోనూ రుతుపవనాలు మళ్లీ జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తరాంధ్ర - ఒడిశా తీరం వైపు పయనించే కొద్దీ తెలంగాణలో వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి.

ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోనూ పిడుగులు, గంటకు 40-60 కిమీ వేగం ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

56
హైదరాబాద్ నగరంలో మారిన వాతావరణం.. పలుచోట్ల రికార్డు వర్షపాతం
Image Credit : Asianet News

హైదరాబాద్ నగరంలో మారిన వాతావరణం.. పలుచోట్ల రికార్డు వర్షపాతం

రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా మేఘావృతమైన వాతావరణం నెలకొనగా, శనివారం సాయంత్రం నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే వారం రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

66
జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు
Image Credit : Gemini AI

జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

వర్షాల వల్ల ఇన్నాళ్లూ పంటలకు నీరు లేక ఇబ్బంది పడ్డ రైతులకు కాస్త మేలు చేకూరినప్పటికీ, ఒక్కసారిగా కురిసే తీవ్రమైన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
Recommended image2
Now Playing
TDP MLA Miriyala Sirisha Devi Emotional Speech About Pawan Kalyan | Adavi Thalli Bata 2.0
Recommended image3
Weather Update: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్ తో ఈ ప్రాంతాల్లో వర్షాలు
Related Stories
Recommended image1
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image2
Walking: నడిచే వేగం తగ్గితే డేంజర్ బెల్స్ మోగినట్లేనా? వాకింగ్ వెనుక ఉన్న షాకింగ్ హెల్త్ సైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved