Asianet News TeluguAsianet News Telugu

Ennenno Janmala Bandham: విన్ని ప్లాన్ కి బలైన వేద.. మూడ్ ఆఫ్ లో యష్?

Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి స్టోరీ తో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి సాగుతుంది. ప్రస్తుతం అన్యోన్యంగా ఉన్న దంపతులను విడదీసి తన ప్రేమికురాలిని తీసుకువెళ్లిపోవాలనుకునే వ్యక్తి కధతో కొనసాగుతుంది ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Vinni gets jealous of Vedaswini and Yash's relationship in todays Ennenno Janmala Bandham serial gnr
Author
First Published Mar 24, 2023, 10:38 AM IST

ఎపిసోడ్ ప్రారంభంలో విన్నితో చాలా థాంక్స్ చెప్తుంది వేద. ఎందుకు ఇన్ని థ్యాంక్స్ లు అంటాడు విన్ని. నువ్వు, మా అమ్మ నాకు చెప్పకపోయి ఉంటే నేను నా భర్తకి అంత దగ్గరయి ఉండేదాన్ని కాదు వేద. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది మనసులోని భారం అంతా దించేసినట్లు రిలీఫ్ గా ఉంది అంటుంది. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు  కావాలి నేను నీ నుంచి కోరుకున్నది ఇదే.

ఈరోజు మీ ఫస్ట్ యానివర్సరీ కదా ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అని అడుగుతాడు విన్ని. ఫ్యామిలీ అందరి ముందు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కానీ ఏమి కొనాలో  అర్థం కావట్లేదు అంటుంది వేద. ఆ మాటలకి కోపంతో రగిలిపోతాడు విన్ని. కానీ బయటికి మాత్రం మంచి వాచి గిఫ్ట్ ఇవ్వు అది చూసిన ప్రతిసారి నువ్వే గుర్తు రావాలి అని సలహా ఇస్తాడు విన్ని.

కానీ నాకు అంత టైం లేదు అంటుంది వేద. నేను ఉన్నాను కదా అవన్నీ నేను చూసుకుంటాను అంటాడు విన్ని. ఫ్రెండ్షిప్ కి ఇంత వాల్యూ ఇస్తున్నందుకు నిన్ను ఎప్పటికీ మర్చిపోను థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది వేద. వెళ్ళిపోతున్న వేదని చూస్తూ మీ మధ్య ఊహించినంత గ్యాప్ క్రియేట్ చేసి నిన్ను నాతో అమెరికాకి ఎత్తుకుపోతాను అనుకుంటాడు విన్ని. మరోవైపు ఫస్ట్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అని ఆలోచనలో ఉంటారు యష్ దంపతులు.

వన్ అవర్ లో ఫస్ట్ యానివర్సరీ వస్తుంది ఎలా విష్ చేయాలో అనుకుంటూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మరోవైపు ఈ టైంలో వాళ్లు ఏం చేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారా అని ఆలోచనలో పడతాడు. వన్ అవర్ లో వాళ్ళ యానివర్సరీ వస్తుంది ఆ టైంలో వాళ్ళిద్దరూ ఒక్క దగ్గరే ఉండకూడదు ఏం చేయాలి అనుకుంటూ ఆలోచనలో పడతాడు విన్ని.

ఏదో ఆలోచన వచ్చినట్లుగా మంచి ఐడియా అనుకుంటూ.. వేద కి ఫోన్ చేసి కడుపులో నొప్పి వస్తుంది చాలా హెవీగా వస్తుంది అంటూ వేదని కంగారు పెట్టేసి తన దగ్గరికి రమ్మని చెప్తాడు. అదే విషయాన్ని యష్ తో చెప్తుంది వేద. ఇంత అర్ధరాత్రి ఒక్కదానివే వద్దు నేను కూడా వస్తాను అంటాడు యష్. వద్దు ఇంట్లో ఖుషి ఒక్కత్తే ఉంది అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అంటూ కంగారుగా వెళ్ళిపోతుంది వేద. వేద రావటం చూసి ఓవరాక్షన్ చేస్తాడు విన్ని.

నేను వచ్చేసాను ఏం కాదు అంటూ అతన్ని చెక్ చేస్తుంది వేద. బయట డిన్నర్ చేసావా అని అడుగుతుంది. అవును అంటాడు విన్ని. అందుకే అప్సెట్ అయినట్టుగా ఉంది అంటూ ఇంజక్షన్ చేస్తుంది వేద. రెండు నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుంది అంటూ వినికి ధైర్యం చేస్తుంది. 12 అయ్యేసరికి వేద వచ్చేస్తుంది తనకి కూడా నాలాగే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఇలాంటి స్పెషల్ డేస్ ని సెలబ్రేట్ చేసుకోవటం తనకి చాలా ఇష్టం.

నేను కూడా తన ఆనందం కోసమే ఎదురు చూస్తున్నాను మా పెళ్ళి రోజుని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నాను అనుకుంటాడు యష్. మరోవైపు దిన్ని దగ్గర ఉన్న వేద నా కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. భార్య భర్తలు గా మారిన రోజు ఇద్దరిని కలిపి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం అనుకుంటుంది వేద. తన ఫేసులో టెన్షన్ చూసి నవ్వుకుంటాడు విన్ని.

నాకు ప్రాబ్లం అని చెప్పగానే ఈ టైంలో కూడా వచ్చినందుకు చాలా థాంక్స్ అంటాడు విన్ని. దానికి థాంక్స్ ఎందుకు మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీకు హెల్త్ బాకపోతే నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను అంటుంది వేద. నేను బయలుదేరుతాను అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోబోతున్న వేదని ఆపి వాష్ రూమ్ కి పరిగెడతాడు విన్ని. ఏమైంది అంటూ కంగారుగా వెనక్కి వస్తుంది వేద.

మరోవైపు వేద కోసం ఎదురు చూస్తున్న యష్ తను ఇంకా రాలేదు ఏంటి ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందా అనుకుంటాడు. మరోవైపు వాష్ రూమ్ నుంచి వచ్చిన విన్ని నా హెల్త్ బాగా అప్సెట్ అయినట్టుగా ఉంది నాకు చాలా భయంగా ఉంది కంగారుగా ఉంది అని వేదాన్ని కూడా కంగారు పెట్టేస్తాడు. భయపడకు నేను ఉన్నాను కదా అని అతని పక్కనే ఉండిపోతుంది వేద.

నాకు తగ్గేంతవరకు నువ్వు వెళ్లొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు విన్ని. మరోవైపు రూమ్ ని డెకరేట్ చేస్తూ, వేద కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు యష్. తరువాయి భాగంలో వేద కోసం వెయిట్ చేస్తూ సోఫాలోనే పడుకుండిపోతాడు యష్. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో నాకోసం ఎదురు చూసి ఇక్కడే పడుకుండిపోయినట్లుగా ఉన్నారు అనుకుంటుంది వేద.

Follow Us:
Download App:
  • android
  • ios