కన్నడ నటి సంజన గల్రాని తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టీవీ సీరియళ్ళలో నటిస్తోంది. 'మీటూ' ఎఫెక్ట్ ఉదృతంగా సాగుతున్న సమయంలో సంజన 'గండ హెండతి' సినిమా సమయంలో దర్శకుడు రవి శ్రీవాత్సవ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. 

తనను నగ్నంగా చిత్రీకరించాడని, బోల్డ్ సీన్స్ లో నటించడం ఇష్టం లేకపోయినా బెదిరించి మరీ అలాంటి సీన్స్ లో నటించేలా చేశాడని ఇలా చాలా ఆరోపణలు చేసింది. దీంతో దర్శకుడు రవి శ్రీవాత్సవ స్పందించక తప్పలేదు. తను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని సినిమా గురించి సంజనకి చెప్పే హీరోయిన్ గా తీసుకున్నామని ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

ఈ విషయాన్ని దర్శకుడు తేలికగా తీసుకోలేదు. దీంతో ఫైనల్ గా సంజన క్షమాపణలు చెప్పక తప్పలేదు. చిన్న వయసులో తాను చిత్రీకరణ సమయంలో జరిగిన ఘటనల గురించి చెప్పడం వెనుక దురుద్దేశం లేదని వెల్లడించింది.

దర్శకుడు రవి శ్రీవాత్సవకి, దర్శకుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్, సంఘం పతాధికారులకు ఆమె క్షమాపణలు చెప్పారు. సంజన క్షమాపణలు చెప్పేవరకు ఆమెను కన్నడ చిత్రాల్లో నటించేందుకు అవకాసం ఇవ్వమంటూ గతంలో దర్శకుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె క్షమాపణలు చెప్పారు.  

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!