మీటూ వివాదం సోషల్ మీడియాలో రోజుకో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. ఎవరో ఒకరు వారికి జరిగిన చేదు అనుభవాలను బయటపెడుతుండగా ఇతరులు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. రీసెంట్ గా అమలాపాల్ లీనా చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ తాను కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుపడం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. 

అమలా పాల్ రీసెంట్ గా చేసిన ట్వీట్ లో డైరెక్టర్ సుసి గణేషన్ నుంచి ఎదురైనా లైంగిక వేధింపుల గురించి వివరించింది. తిరుటుపాయలే 2 చిత్రంలో నేను ఈ దర్శకుడిని నుంచి కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. చేడు అర్ధం వచ్చేలా మాట్లాడేవాడు. అవసరం లేకపోయినా కావాలని అవకాశాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేసేవాడు. లీనా అతని నుంచి ఎలాంటి వేధింపులను ఎదుర్కొందో నేను అర్ధం చేసుకోగలను. 

ఆమె దైర్యంగా బయటకు చెప్పినందుకు అభినందిస్తున్నా.ఆ విధంగా వేదించే వారు. ఇంట్లో వారిని చాలా బాగా చూసుకుంటారు గాని బయట మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని అమల పాల్ వివరించింది. అదే విధంగా సుసి గణేషన్ పై ఆరోపణలు చేయగానే తనకు అతని భార్య నుండి ఫోన్ వచ్చిందని చెబుతూ.. ఆమె ఇష్టం వచ్చినట్లుగా తీడుతున్నారు. జరిగిన విషయాన్నీ చెప్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినకుండా తిట్టారు. ఇది ఒక షాకింగ్ విషయమని అమలాపాల్ పేర్కొంది.