శృతి హరిహరన్   మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేయడంతో, అర్జున్ వాటిని తిప్పి కొట్టడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో  ఆమె  అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో వివాదం మరింత ముదిరింది. రాజీకి వచ్చే ప్రసక్తి లేదని ఆమె తేల్చి చెప్పినట్లైంది. దాంతో  యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ అరెస్ట్‌ అవుతారా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.   

మొదట్లో లైట్ తీసుకున్నా... మీటూ సినీ వర్గాల్లో భయం పుట్టిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అంతా అదే దారిలో ప్రయాణించే అవకాసం ఉంది.  గాయనీ చిన్మయి ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కేసు పెడుతుందని చెప్పుకుంటున్నారు.  వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మీటూ అంటూ ఆయన్ని నిలదీసింది చిన్మయి.    2015లో ఒక చిత్రంలో నటిస్తుండగా  షూటింగ్ టైమ్ లో  రిహార్సల్స్  పేరుతో డైరక్టర్ చెప్పకుండానే తనను దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు లైంగిక వేధింపుల  ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేసారు.  బెంగళూర్‌లోని కబ్బన్‌పార్క్‌ పోలీసులకు అర్జున్‌పై ఫిర్యాదు చేసింది.   ఇదిలా ఉంటే ఇప్పటికే శృతిపై అర్జున్ పరువు నష్టం దావా వేశాడు.బెంగళూర్‌ సిటీ సివిల్‌ కోర్టులో శ్రుతిహరిహరన్‌పై రూ.5 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో  నటి శ్రుతీహరిహరన్‌ కూడా అర్జున్‌ను ఢీకొనడానికి ఇలా పోలీస్ కేసుతో  సిద్ధమైంది. దీంతో పోలీసులు నటుడు అర్జున్‌ను అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.