Asianet News TeluguAsianet News Telugu

Krishna Mukunda Murari: తల్లి చేతిలో దెబ్బలు తిన్న మురారి.. అసలు నిజాన్ని చెప్పి షాకిచ్చిన గౌతమ్!

Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ కథ కథనాలు బాగుండటంతో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. మంచి కోసం పోరాడి తన సంసారంలో సమస్యలు తెచ్చుకున్న ఒక అమాయకురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

revathi slaps murari about krishna in todays Krishna Mukunda Murari serial gnr
Author
First Published Mar 24, 2023, 12:08 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో నీ కొడుకు నా చేతుల్లో పెరిగాడు అందుకే వాడికి నాలాగా క్రమశిక్షణ అబ్బింది అందుకే నా తరఫున నించున్నాడు అంటుంది భవాని. నేను వెళ్తాను అంటుంది కృష్ణ. వెళ్ళు కానీ తిరిగిరాకు అంటుంది భవాని. ఒక్క నిమిషం అంటూ మురారి వైపు తిరిగి భార్య కోసం ఆమాత్రం చేయలేరా అంటుంది. చేస్తాను కానీ ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావో చెప్పు అంటాడు మురారి.

ఒక పని మీద గౌతమ్ సర్ దగ్గరికి వెళ్తున్నాను  అంటుంది కృష్ణ. పంపించను అని ఖచ్చితంగా చెప్తాడు మురారి. నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది నేను వెళ్తున్నాను అంటూ వెళ్లబోతుంది కృష్ణ. నువ్వు ఎక్కడికీ వెళ్ళటానికి వీల్లేదు అని కృష్ణ చేయి పట్టుకుంటాడు మురారి. నేను వెళ్ళాలి దయచేసి వదలండి అంటూ మురారిని రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాను.

ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నీ హద్దులు నీకు తెలియటం లేదు అందుకే భర్తగా నా అధికారం చూపిస్తున్నాను అంటాడు మురారి. ఎప్పుడూ లేనిది ఎందుకంత ఆవేశం అంటూ మందలిస్తుంది భవాని. ఆడపిల్లని అలా ఇబ్బంది పెట్టకూడదు వదిలేయ్ అంటుంది సుమ. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ మందులిస్తుంది రేవతి. ఈ పిచ్చి తన వల్లే పట్టింది అంటాడు మురారి.

ఒక గంటలో వచ్చేస్తాను అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. అంత మొండితనం ఏంటి నీకు వెళ్లనని చెప్పు అంటూ కృష్ణని మందలిస్తుంది సుమ. చంపేస్తాను చెయ్యి వదులు అంటూ మురారిని చాచి కొడుతుంది రేవతి. ఎవరు ఎంత చెప్పినా చేయి వదలడు మురారి. వదలండి అంటూ బలవంతంగా చేయి విడిపించుకుంటుంది కృష్ణ. కందిపోయిన తన చేతిని చూసుకుంటూ నాలో ఉన్న సహనం పూర్తిగా చచ్చిపోయింది.

ఇంతవరకు మీరు ఉన్నారని నమ్మకం ఉండేది కానీ మీ వల్లే ఇలాంటి కష్టం కలుగుతుందని నేను ఊహించలేకపోయాను అంటుంది కృష్ణ. నా స్వేచ్ఛ నా ఆత్మ అభిమానం అన్ని పెద్దరికానికి ఆత్మహతి అయిపోయాయి. మీ వల్ల నాకు భరోసా ఏది, నా చేయి పట్టుకొని ఆపినప్పుడే అంత ఎత్తున ఉన్న మీరు నా దృష్టిలో పూర్తిగా దిగజారి పోయారు. మీలో ఇంకొక మనిషి ఉన్నాడు ఆ మనిషి అచ్చమైన మగాడు.

మీ అహంకారానికి నేను తల వంచేదాన్ని కాదు. ఇప్పుడు వెళ్తాను కానీ మళ్ళీ వస్తాను.. ఉండిపోవటానికి కాదు శాశ్వతంగా వెళ్లిపోవడానికి అంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది కృష్ణ. ఆటోలో వెళుతూ మురారి ప్రవర్తనకి కన్నీరు పెట్టుకుంటుంది. గౌతమ్ దగ్గరికి వస్తూనే అతని చెంప పగలగొడుతుంది. సుపీరియర్ కదా అని గౌరవం చూపిస్తే పిచ్చిదాన్ని అనుకున్నారా.

నేను ఎంతో టెన్షన్ గా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా నన్ను టెన్షన్ పెడతారా. నందినికి రియాక్షన్ ఇచ్చే టాబ్లెట్ ఇచ్చి ఆమెని చంపేయాలనుకుంటున్నారా అంటుంది. నందినిని చంపేయాలనుకుంటుంది నేను కాదు మీ పెద్దత్తయ్య భవానీ దేవి అంటూ నిజాన్ని చెప్పి షాక్ ఇస్తాడు గౌతమ్. నన్ను ఇంకా వెర్రిదాన్ని చేయాలనుకుంటున్నారా మా పెద్ద అత్తయ్య నందిని కి తల్లి అని చెప్తుంది కృష్ణ.

ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని నువ్వు నాకు టాబ్లెట్ చూపించినప్పుడు అనుకున్నాను కానీ అదే నిజం ఆ టాబ్లెట్స్ ఇంకొద్ది రోజులు వేస్తే నందిని చనిపోతుంది అంటాడు గౌతమ్. ఇదే విషయాన్ని నాకు ముందు ఎందుకు చెప్పలేదు అంటుంది కృష్ణ. నువ్వు మనసులో ఏది దాచుకోవు వెళ్లి వెంటనే అడిగేస్తావు. నిజం తెలిస్తే నీకు ప్రమాదమే నాకు నందిని కి కూడా ప్రమాదమే అంటాడు. మీకెందుకు ప్రమాదం అని అడుగుతుంది కృష్ణ.

నిజం తెలిస్తే నందినిని చంపేస్తారు లేకపోతే మా అమ్మ నాన్నని అయినా చంపేస్తారు అంటాడు గౌతమ్. ఆ ఇంట్లో అంత క్రూరమైన వాళ్ళు ఉన్నారా అంటుంది కృష్ణ. పరువు కోసం కన్న కూతురి జీవితాన్ని బలి తీసుకోవాలనుకునే వాళ్ళకి మేము ఒక లెక్కా నేను నందిని ప్రేమించుకున్నాము అసలు ఏం జరిగిందో చెప్తాను విను కానీ విన్న తర్వాత ఇక్కడే మరిచిపోవాలి.. నేను బ్రతికున్నట్టు మీ వాళ్ళకి తెలియకూడదు అంటాడు గౌతమ్.

నా తల పగిలిపోతుంది తను సిద్దు, సిద్దు అని కదా కలువరిస్తుంది అంటుంది కృష్ణ. అది నేనే నా పూర్తి పేరు గౌతమ్ సిద్ధార్థ అంటాడు గౌతమ్. ప్రేమించిన వాళ్ళు ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి కానీ పిరికివాడిలాగా పారిపోవడమేమిటి అని నిలదీస్తుంది కృష్ణ. ఏం జరిగిందో చెప్తాను విను అంటూ జరిగిందంతా చెప్తాడు గౌతమ్. నందిని కి పెళ్లి అయిపోయింది అని చెప్పి కలవనీయకుండా చేశారు.

నందిని కి పెళ్లి కాలేదు అని చెప్తుంది కృష్ణ. షాక్ అయిన గౌతమ్ నేను నందిని మీద ఆసలు వదిలేసుకోవాలని అలా చెప్పి ఉంటారు అంటాడు. నందిని మరో పెళ్లికి ఒప్పుకోలేదు అయ్యుంటుంది అందుకే గతాన్ని మర్చిపోయేలాగా చేస్తున్నారు అంటాడు గౌతమ్. నాకు ఇప్పుడు బాధ్యత పెరిగింది నేను మీ ఇద్దరినీ కలుపుతాను. ఈ ప్రాసెస్ లో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొంటాను అంటుంది కృష్ణ. కానీ నువ్వు జాగ్రత్త అంటాడు గౌతమ్.

అదంతా నేను చూసుకుంటాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. మరోవైపు కృష్ణ అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు మురారి. అంతలోనే రేవతి అటువైపుగా వెళ్తుంటే తలనొప్పిగా ఉంది టాబ్లెట్స్ కావాలి అని అడుగుతాడు. డాక్టరు బయటకు వెళ్ళింది వస్తుందో రాదో తెలియదు వస్తే అడిగి ఇస్తాను అంటూ చాలా కోపంగా మాట్లాడుతుంది రేవతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios