దక్షిణాదిలో హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా... రొమాంటిక్ సినిమాలు చేసే హిరోయిన్ల కేటగిరీలో మాత్రం కొంతమంది మాత్రమే వుంటారు. కొంతమంది అభినయానికి ప్రాధాన్యత ఇస్తే మరికొంతమంది మాత్రం ఆడియెన్స్ ను తమ అందాల మత్తులో ముంచేయాలని చూస్తారు. అలాంటి హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ ఆడ్రియా ఒకరని చెప్పొచ్చు. 

 

యుగానికి ఒక్కడు సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు హాట్ ఇమేజ్ సంపాదించుకుంది. సినిమాల్లో ఆడ్రియా ఉంది అంటే ఒక్క ఇంటిమేట్ సీన్ అయినా ఉండాల్సిందే అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం కెరియర్ అంత సాఫీగా సాగకున్నా సరే వచ్చిన చిన్న చిన్న అవకాశాలను చేస్తుంది ఆండ్రియా. 


 

ఈమధ్యనే సిద్ధార్థ్ గృహం సినిమాలో నటించిన ఆండ్రియా ఈమధ్య ఇంటర్వ్యూ లో కథ డిమాండ్ చేస్తే ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్ గా నటించేందుకు కూడా సిద్ధమే అని చెప్పింది. అయితే అందులో కండీషన్స్ అప్లై అని మెలిక పెట్టింది. కథ కథనాలు ముందు వివరించి చెబితే ఆ సినిమాలో తాను న్యూడ్ గా నటించడం తప్పనిసరి అయితే అందుకు తాను వెనక్కి తగ్గనని అంటుంది ఆండ్రియా.

 

ఒంటి మీద నూలుపోగు లేకుండా కూడా తాను నటించేందుకు సిద్ధమే అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. కథ అవసరం రీత్యా అంటున్నా అమ్మడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేందుకు గట్స్ ఉండాలని అంటున్నారు. మరి ఆమెను అలా చూపించే కథ దర్శకుడు ఎవరై ఉంటారో చూడాలి.