Asianet News TeluguAsianet News Telugu

'నా కూతురు సన్నీలియోనీ' అంటూ వర్మ షాట్ ఫిలిం

  • నా కూతురు సన్నీ లియోనీ అంటున్న వర్మ
  • ఇలాంటి వెరైటీ టైటిల్ తో షాట్ ఫిలిం తెరకెక్కించిన వర్మ
  • నైనా గంగూలీని సన్నీ పాత్ర చేయించి మనసులోని భావాలు కక్కిన వర్మ
ramgopal varma short film titled my daughter sunny leone

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ సబ్జెక్ట్ ఎంచుకుని సినిమా తెరకెక్కించాడు. అయితే ఈసారి వర్మ రిలీజ్ చేసిన సినిమా షార్ట్ ఫిలిం. "నా కూతురు సన్నీలియోన్ అవ్వాలనుకుంటోంది" అనే టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం కాసేపటి క్రితమే విడుదలైంది. టైటిల్ చూసి చాలామంది షార్ట్ ఫిలింలో బోలెడన్ని సీన్లు ఉంటాయని అనుకున్నారు.

 

వర్మ డైరెక్ట్ చేస్తున్న "గన్స్ అండ్ థైస్" సిరీస్ ట్రయిలర్ లో నగ్నంగా ఉండే సన్నివేశాల్ని నిర్మోహమాటంగా చూపించాడు. దాంతో... సన్నీలియోనీ పై తీసిన షార్ట్ ఫిలింలో మరిన్ని బూతు సీన్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ ఈ షార్ట్ ఫిలిం ద్వారా సెక్స్ పై తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పాడు వర్మ. ఓ మధ్యతరగతి అమ్మాయి నేను సన్నీలియోనీ అవుతానంటుంది తన తల్లిదండ్రులతో. కూతుర్ని వాళ్లు మందలిస్తారు. కానీ కూతురు మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉంటుంది. పాత్ర కూతురిదే అయినా ఆ పాత్రతో దాన్ని సృష్టించిన వర్మ మనసులోని భావజాలం మొత్తాన్ని బయటపెట్టాడు.

 

"ఒక్కొక్కరికి ఒక్కో ప్లస్ పాయింట్ ఉంటుంది. నా బాడీ నాకు ఎస్సెట్. దాన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను. నా లాభం కోసం నేను నా శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా. ఇందులో తప్పేముంది" అంటూ షార్ట్ ఫిలింలో అమ్మాయి డైలాగ్స్ చెప్తుంది. 11 నిమిషాల ఈ షార్ట్ ఫిలింలో ఇలాంటి డైలాగ్స్ చాలా పెట్టాడు వర్మ.  గతంలో వర్మ తీసిన వంగవీటి సినిమాలో హీరోయిన్ గా చేసిన నైనా గంగూలీ ఈ షార్ట్ ఫిలింలో నటించింది. వర్మ తీసిన ఈ షాట్ ఫిలిమ్తో మరోసారి నైనాకి యమా ప్రచారం దొరుకుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios