రోబో కు సీక్వెల్ ‘2.0’వచ్చేసింది. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.  సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ చిత్రానికి సోషల్ మెసేజ్  జోడించి తెర‌కెక్కించిన శంక‌ర్ మ‌రో సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు 2.0 సినిమా చూసిన వారికి అర్ద‌మ‌వుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక మరో సీక్వెల్  ‘3.0’ ఖచ్చితంగా ఉంటుందనే సంకేతాలిచ్చాడు డైరక్టర్ శంకర్.   చిట్టి స్థానంలో చిన్ని (తమిళంలో కుట్టి) అనే సూపర్ హ్యూమనాయిడ్ రోబో ఉంటుందని హింటిస్తూ 2.0 సినిమాను ముగించడంతో ఫ్యాన్స్  ఆనందానికి అవధులే లేదు. 

‘భారతీయుడు-2’ పూర్తయ్యాక ‘3.0’ కథ రాస్తానని అన్నాడు. ఇప్పటికే మంచి ఐడియాల కోసం  ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. ఇదంతా చూస్తూంటే  ‘3.0’ సినిమా తీసే ఉద్దేశం శంకర్‌కు బలంగానే ఉన్నట్లు స్పష్టమైంది.  

‘రోబో’లో 2.0 పాత్రను ప్రవేశపెట్టినట్లే.. తాజా చిత్రంలో  3.0ను రంగంలోకి దింపాడు.బుల్లి  రోబో చిన్నిగా రజనీ తనదైన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్  పంచాడు. ఈ ఎలిమెంటే ఈ సినిమాలో  ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన హైలైట్లలోఒకటిగా మారింది. పిల్లలు ఆ పాత్రను బాగా ఇష్టపడుతున్నారు. ఆ పాత్రకు వస్తున్న  స్పందన చూసిన లైకా ప్రొడక్షన్స్ వారు...సీక్వెల్  కథ వెంటనే రెడీ చేయమని , భారతీయుడు పూర్తైన వెంటనే తెరకెక్కిద్దామని అడుగుతున్నారట. 

ట్రేడ్ లెక్కల ప్రకారం చూసినా ‘2.0’ రివ్యూలు ఎలా ఉన్నా ...కమర్షియల్ గా  మంచి విజయమే సాధించేలా ఉంది కాబట్టి శంకర్ సీక్వెల్ గురించి వెనుకంజ వేయాల్సిన అవసరం కూడా లేదంటోంది. కాకపోతే ఇంకో రెండు మూడేళ్ల తర్వాత ఈ సినిమా మొదలుపెట్టాలనుకుంటేనే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అప్పటికి రజనీ  ఇంకో భారీ సినిమా చేయడానికి సిద్దంగా ఉంటారా. ఆయన ఆరోగ్యం, లుక్ సహకరిస్తాయా అన్నదొక్కటే డౌట్. 

ఇవి కూడా చదవండి.. 

'2.0' రివ్యూలపై మేధావులు అంటూ 'దిల్ రాజు' వెటకారం

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?