Asianet News TeluguAsianet News Telugu

దూత కోసం చైతూ ఎంత తీసుకున్నాడో తెలుసా..? వైరల్ అవుతున్న నాగచైతన్య రెమ్యూనరేషన్

తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కబోతున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. వెబ్ సిరీస్ తో  ఫస్ట్ టైమ్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ వెబ్ సిరీస్ కోసం చేతూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..? 

Naga chaitanya Remuneration For Dhootha Web Series JMS
Author
First Published Nov 28, 2023, 9:55 PM IST

అక్కినేని నట వారసత్వం తీసుకునన్న మూడో తరం హీరో నాగచైతన్య. తాత నాగేశ్వరరావు.. తండ్రి అక్కినేని నాగార్జున నటన పునికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు చైతూ. కాని తాత, తండ్రిలా..టైర్ 1 హీరోగా మారలేకపోయాడు. టైర్ 2 హీరోల లిస్ట్ లోనే ఉన్నాడు చైతూ. ఎంత ప్రయత్నంచేసినా.. హిట్లు అయితే పడుతున్నాయి కాని.. స్టార్ హీరో మాత్రం కాలేకపోతున్నాడు నాగచైతన్య.  

అయితే స్టార్ హీరోగా అవ్వకపోయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్కుని మాత్రం సాధించగలిగాడు చైతూ. హిట్టు.. ప్లాపు.. హిట్టు.. ప్లాపు అన్నట్టు సాగుతుంది నాగచైతన్య కెరీర్. ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో ఒ హిట్టు పడితే మరో ప్లాప్ పడుతూ వస్తుంది.  టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో పెద్దగా విజయం సాధించలేదు. ఇక చెప్పుగోదగ్గ సినిమా అంటే లవ్ స్టోరి, బంగార్రాజు మాత్రమే. 
 
ఇక డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యాడు నాగచైతన్య. గతంలో దర్శకుడు కె విక్రమ్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ అయ్యి...స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అయితే ఈ వెబ్ మూవీ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నా..  కొన్ని కారణాల వల్ల  వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు దూత వెబ్ సిరీస్ ను రిలీజ్  చేయబోతున్నారు. చైతూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముహూర్తం కూడా ఖరారు అయ్యింది. ఈ వెబ్ మూవీతో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు అక్కినేని హీరో. ఇక దూత సిరీస్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక రీసెంట్ గా ఈమూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య ఎంత తీసుకున్నాడు అనేది ప్రస్తుతం హైలెట్ అవుతోంది. అయితే ఈ వెబ్ మూవీకి గాను  నాగ చైతన్య 8 కోట్ల రూపాయలు తీసుకున్నాడని తెలుస్తోంది.  సాధారణంగా ఒక సినిమాకు నాగచైతన్య 10 నుంచి 15 కోట్ల వరకూ తీసుకుంటున్నాడట. ఇక దూతకోసంమాత్రం 8 కోట్లు అందుకున్నాడని టాక్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios