‘అజ్ఞాతవాసి’చిత్రం తర్వాత అంతగా సోషల్ మీడియాలో చీల్చి చెండాడబడుతున్న సినిమా ఏదీ అంటే   ‘విన‌య విధేయ రామ’ అని చెప్పాలి.  ఈ సినిమాపై ఓ రేంజిలో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే అందులో వింత కూడా ఏమీ లేదు. అయితే ఈ ప్లాఫ్ క్రెడిట్ మొత్తం బోయపాటి శ్రీను తీసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం బోయపాటి మార్క్ తో సాగింది. 

చాలా అతి సీన్స్ సినిమా నిండా పరుచుకుని డిజాస్టర్ కు దారి తీసాయి.  కలెక్షన్స్ పరంగానూ తొలిరోజు 26 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత మూడు రోజుల్లో క‌లిపి కేవ‌లం 14 కోట్లు కూడా తీసుకురాలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను ని ..రామ్ చరణ్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ కలిసి బ్లేమ్ చేస్తున్నారు. ఇకపై తమ మెగా క్యాంప్  హీరోతో సినిమా చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు.  తమ హీరోలుకు కథలు చెప్పే కార్యక్రమం పెట్టుకోవద్దని అంటున్నారు.

బోయపాటి శ్రీను..స్వతహాగా నందమూరి క్యాంప్ కు చెందిన వాడిని, అందుకే కావాలని కోవర్ట్ గా మారి, రంగస్దలంతో సూపర్ హిట్ ఇచ్చిన రామ్ చరణ్ ని వెనక్కి లాగేసాడంటున్నారు. అంతేకాకుండా కథా నాయడుకు ఎన్టీఆర్ చిత్రానికి ఫేవర్ చేయటానికే ఇలాంటి పన్నాగం బోయపాటి పన్నాడని ఆరోపిస్తున్నారు. అయితే తమ హీరో సినిమా ఫెయిలయితే ఏ ఫ్యాన్స్ కూడా తట్టుకోలని స్దితిలో ఉంటున్నారు. దాంతో సాధ్యమైనంతవరకూ డైరక్టర్స్ మీదో, మరొకరి మీదో నెపం వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. 

వాస్తవానికి ఏ డైరక్టర్ కు అయినా తన సినిమా సూపర్ హిట్ అవ్వాలి. తనే విజేతగా నిలవాలి అని ఉంటుంది. అంతేగాని ఫలానా హీరో కి హిట్ రావటం కోసం తన కెరీర్ ని బలి పెట్టుకోడు. కాబట్టి ఇవన్నీ అర్దలేని ఆరోపణలే. కానీ వారి బాధను కూడా అర్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రామ్ చరణ్ వెంటనే మరో హిట్ ఇచ్చి తన అభిమానులు మళ్లీ కాలరు ఎగరేసే  పరిస్దితి తేవాలి. అంతకు మించి దారి లేదు. బోయపాటి ని తిట్టిపోసినా కలిసి వచ్చేదేమీ లేదు.

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్