Asianet News TeluguAsianet News Telugu

Brahmamudi: అందరి ముందు కనకం దీవెనలు తీసుకున్న కావ్య.. రాహుల్ ని బెదిరిస్తున్న స్వప్న!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి మంచి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. తన ఇష్టం లేకుండానే ఇష్టం లేని వ్యక్తితో తాళి కట్టించుకున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Kavya appreciates Kanakam's skit and seeks blessings in todays Brahmamudi serial gnr
Author
First Published Mar 24, 2023, 2:17 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో స్టేజ్ మీద జోకర్ షో చేస్తున్న తల్లిని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. అమ్మ అంటూ కంగారుగా వెళ్లి తన తల్లిని హత్తుకున్నట్టుగా భ్రమ పడుతుంది. కావ్య కళ్ళల్లో నీళ్లు చూసి అందరూ నవ్వుతుంటే నీకేమైంది అని అడుగుతాడు రాజ్. మీకు నవ్వు మాత్రమే కనిపిస్తుంది కానీ నవ్వించడానికి పడే తపన నాకు కనిపిస్తుంది అంటుంది కావ్య.

ఇక వెళ్ళిపోతున్న కావ్య ని మీ పెర్ఫార్మన్స్ బాగుంది అని మెచ్చుకుంటాడు రాజ్. నా మనవడు పెళ్లికి మీరు మంచి ప్రదర్శన ఇచ్చారు మీలోని కళ కి నేను ఇచ్చే బహుమతి అంటూ డబ్బులు ఇవ్వబోతాడు సీతారామయ్య. మన కొత్త కోడలు చేతిమీదుగా ఇప్పిద్దాం అంటుంది చిట్టి. నేనా అంటూ మొహమాటంగా ఆ డబ్బు తీసుకొని అందరూ మీ ప్రదర్శనలో ఉన్న నవ్వును మాత్రమే చూశారు.

కానీ మీలో ఉన్న దుఃఖాన్ని కూడా నేను చూశాను. దుఃఖాన్ని, హాస్యాన్ని కూడా సమపాళ్లల్లో పండించారు. మీ కళ్ళకి నా జోహార్లు అంటూ ఆమె కాళ్ళకి దండం పెడుతుంది కావ్య. మరోవైపు న్యూస్ రిపోర్టర్ ని ట్రాప్ చేస్తూ ఉంటాడు రాహుల్. అదే సమయంలో వెనుక నుంచి స్వప్నను చూసి ఎవరు ఈ వెయిట్ లెస్ వెయిటర్ అనుకుంటూ ఆమె మొహాన్ని చూసి షాక్ అవుతాడు రాహుల్.

ఈ తింగరిది ఈ గెటప్ వేసుకొని నన్ను వెతకడానికి వచ్చినట్లు ఉంది అనుకుంటాడు. మరోవైపు భార్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కృష్ణమూర్తి. వద్దు వద్దు అంటుంటే వినకుండా వెళ్ళింది అంటూ తన బాధని వదిన దగ్గర గోడు వెళ్ళబోసుకుంటాడు కృష్ణమూర్తి. తల్లి మనసు ఆగలేక వెళ్లి ఉంటుంది వచ్చేస్తుందిలే అంటుంది అతని వదిన. ఇంతలోనే అప్పు రావటంతో తనని కూడా అడుగుతాడు కృష్ణమూర్తి.

ఇక్కడ ఎక్కడ కనిపించలేదు అంటుంది అప్పు. అక్కడ ఉన్నది స్వప్న కాదు కావ్య ఒకవేళ అమ్మని ఏమైనా అంటే ఊరుకోదు అంటాడు కృష్ణమూర్తి. అమ్మ వల్ల కావ్య అక్కకి ఏమైనా ప్రాబ్లం అయితే నేనే వెళ్లి ఉప్పు మూటని తీసుకొచ్చినట్లు తీసుకొచ్చేస్తాను అంటుంది  అప్పు. మరోవైపు రాజును పిలిచి బిజినెస్ పార్టనర్ కి కావ్యని పరిచయం చేయమంటారు చిట్టి దంపతులు.

తప్పనిసరి పరిస్థితులలో కావ్యని పిలుస్తాడు రాజ్. మర్యాదగా పిలిస్తే వస్తాను అంటుంది కావ్య. పక్కనే సీతారామయ్య దంపతులు ఉండటంతో తప్పనిసరి పరిస్థితులలో బ్రతిమాలి తీసుకువెళ్తాడు రాజ్. అక్కడ తన బిజినెస్ పార్ట్ టైర్స్ అందరికీ పరిచయం చేస్తాడు నీ భార్య పేరు ఏమిటి అంటే కావ్య పేరు తెలియని రాజ్ కళావతి అని చెప్తాడు. అక్కడ కావ్య ఇంగ్లీషులో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడు.

డిగ్రీ వరకు చదువుకుందని తెలిసి పాసా, ఫెయిలా అంటూ ఆట పట్టిస్తాడు. ఏమో అనుకున్నాను మనవరాలు ఇంగ్లీషు అదరగొట్టేస్తుంది అనుకుంటారు సీతారామయ్య దంపతులు. నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలిసిన అమ్మాయి లాగా ఉంది అంటుంది చిట్టి. అప్పుడే సర్టిఫికెట్ ఇవ్వకండి మంచితనం ముసుగులో ఉంది అంటుంది అపర్ణ.

అందరూ అలా ఉండరు అంటుంది చిట్టి. అదే సమయంలో రాహుల్ ని పిలుస్తూ స్వప్న వేరే వాళ్ళని డాష్ ఇస్తుంది. అది గమనించిన కావ్య స్వప్నక్క లాగా ఉంది అనుకొని ఆమె దగ్గరికి వెళుతుంది. అంతలో రాహుల్ అడ్డుగా వెళ్లి తనొక వెయిటర్ తననేం చూస్తారు అంటూ స్వప్నని వెళ్లిపోమన్నట్లుగా సైగ చేస్తాడు. తనకి డ్రింక్స్ సర్వ్ చేయడమే రావడం లేదు నేను వెళ్లి మాట్లాడుతాను అంటూ తను కూడా కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అంతలోనే కళ్యాణ్ అక్కడికి రావడంతో అతను మీ అత్త కొడుకే కదా ఎందుకు పెళ్ళిలో కనిపించలేదు అని అడుగుతుంది కావ్య. అదే టైం కి కంపెనీలో ఫైర్ ఆక్సిడెంట్ అయింది అందుకే రాలేదు అంటాడు కళ్యాణ్. మరోవైపు స్వప్నని ఎందుకొచ్చావ్ అంటూ మందలిస్తాడు రాహుల్. నువ్వెందుకు వచ్చావు మూడు రోజుల నుంచి ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పి ఎందుకు అబద్దం చెప్పావు అంటూ నిలదీస్తుంది స్వప్న.

నన్ను రూమ్ లో ఒక్కదాన్నే కూర్చోబెట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నావా అని నిలదీస్తుంది స్వప్న. నన్ను అనుమానిస్తున్నావా అంటాడు రాహుల్. చాలా అనుమానిస్తున్నాను ఈ పెళ్లి నుంచి నన్ను కావాలనే తప్పించావు కదా, రాజ్ దగ్గర నుంచి తప్పించుకొని నేను నీ దగ్గర మోసపోయానా అంటూ నిలదీస్తుంది.

నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా ఇక్కడికి వచ్చి నిజం చెప్పాలనుకున్నాను కానీ పరిస్థితి బాగోలేదు అంటాడు రాహుల్. ఇక్కడ పరిస్థితి బానే ఉంది నువ్వు వెళ్లి నిజం చెప్పకపోతే నేనే వెళ్లి నిజం చెప్తాను అంటూ  బెదిరిస్తుంది. నీ గురించి నిజం చెప్పాల్సి వస్తే కావ్య నీ చెల్లెలు అని చెప్తాను. నువ్వేంటో మీ అమ్మ ఏంటో అన్ని తెలిసాయి. మీరు ఆడిన నాటకం కూడా తెలిసింది అంటాడు రాజ్.

ఆ మాటలకి తడబడుతుంది స్వప్న. నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీ దగ్గర డబ్బు ఉన్న లేకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలకే ఆనంద పడిపోతుంది స్వప్న. మీ చెల్లెలు మన పెళ్లి జరగనిచ్చేలాగా లేదు తను నీ గురించి లేనిపోనివన్నీ చెప్పి ఇక్కడ నిన్ను బ్యాడ్ చేసింది అంటాడు  రాహుల్. తను ఎప్పటికీ అలా చేయదు తనకి నేనంటే చాలా ఇష్టం అంటుంది స్వప్న.

అందుకేనా నువ్వు వెళ్ళిపోగానే  పీటల మీద  కూర్చొని రాజ్ చేత  తాళి కట్టించుకుంది డబ్బు కోసమే కదా అంటాడు రాహుల్. తను డబ్బు మనిషి కాదు అంటుంది స్వప్న. ఆ నగలు చూసావా నువ్వు ఎక్కడ తిరిగి వస్తావనే భయంతోనే నిన్ను చెడ్డదాన్ని చేసింది అంటాడు రాహుల్. తరువాయి భాగంలో కావ్య రూమ్ కి వస్తుంది అపర్ణ. రెండు అత్తయ్య అని పిలుస్తుంది కావ్య. నా దృష్టిలో ఇది పాత సామాన్లు పడేసే గది. ఇప్పటికీ నా దృష్టిలో అంతే. నేను ఎప్పుడూ ఈ గదికి రాలేదు. నగల కోసం మాత్రమే వచ్చాను అవి ఆచారం ప్రకారం ఈ ఇంటి కోడలు వేసుకోవాలి నీకు అర్హత లేదు అంటుంది అపర్ణ.

Follow Us:
Download App:
  • android
  • ios