ప్రస్తుతం ఎటు చూసిన ప్రభాస్ 'సాహో' మేనియానే కనిపిస్తోంది. 'బాహుబలి' తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడం, భారీ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందిస్తుండడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో  ఈరోజు అర్ధరాత్రి నుండే స్పెషల్ షోలో మొదలుకానున్నాయి. ఈ సినిమాను ఎందుకు చూడాలనుకునే వారికోసం ఐదు ప్రధాన కారణాలున్నాయి. 

* 'బాహుబలి' లాంటి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. దీంతో 'సాహో'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ ద్వారా సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై కొంత స్పష్టత వచ్చింది. మరి వెండితెరపై ఆయన చేసే యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా మిస్ అవుతాం చెప్పండి.. 

* బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది. ఇప్పటివరకు విడుదలైన సినిమా ట్రైలర్, పాటల్లో ప్రభాస్, శ్రద్ధాల మధ్య కెమిస్ట్రీ బాగా చూపించారు. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇద్దరి జోడి బాగా కుదిరింది. మరి వీరి కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో 
చూడాల్సిందే.. 

* 'సాహో' ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే ఫ్యాన్స్ మామూలు హడావిడి చేయలేదు. 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1' పేరుతో మేకింగ్ వీడియో విడుదలైనప్పుడు అందులో విజువల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. ఒక్క అబుదాబి దేశంలో తీసిన యాక్షన్ సీన్స్ కోసం రూ.70 కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

* రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ని అందివ్వనుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కి ప్రాధాన్యతనిచ్చారు. గ్రాఫిక్స్ వర్క్ కోసమే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మంచి క్వాలిటీతో ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమా ఉంటుందట. అలానే సినిమాలో ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించారు. సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుంది. 

* ఈ సినిమా కోసం అన్ని భాషల్లో నటీనటులను తీసుకొచ్చారు. బహుశా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో ఇంతటి భారీ తారాగణం చూసి ఉండదు. అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, మందిరా బేడి, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ఎవెలిన్ శర్మ వంటి పేరున్న నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. 

'సాహో' ట్విట్టర్ రివ్యూ..!

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

‘సాహో’ టాక్.. ఆ మైనస్ లు ఉన్నా అదుర్స్

సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

'సాహో' డిజిటల్ రైట్స్.. అమెజాన్ భారీ ఆఫర్!