Asianet News TeluguAsianet News Telugu

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో దేశం మొత్తం సాహో ఫీవర్ నెలకొంది.

Andhra Pradesh Govt Serious on prabhas Saaho movie
Author
Hyderabad, First Published Aug 28, 2019, 4:48 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో దేశం మొత్తం సాహో ఫీవర్ నెలకొంది. మునుపెన్నడూ లేని విధంగా సాహో చిత్రాన్ని అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా విడుదల దగ్గర పడే కొద్దీ సాహోపై వివాదాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం సాహో చిత్ర టికెట్ల ధర పెంపుపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సాహో టికెట్లని నిర్ణీత ధరకంటే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఇది కాస్త హైకోర్టు వరకు చేరింది. హైకోర్టు ఏపీ చీఫ్ సెక్రటరీని దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది. 

తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ సాహో చిత్ర నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో సాహో టికెట్స్ ధర పెంపుకు అనుమతి లేదు. ఎంత భారీ బడ్జెట్ చిత్రం అయినా, ఏ హీరో సినిమా అయినా ప్రభుత్వం దృష్టిలో సమానమే. సాహో చిత్రంపై ఒకలా, మరో సినిమాపై ఒకలా పక్షపాత ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించదు. టికెట్ల ధర పెంచడానికి వీల్లేదు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

ఇప్పటికే ఏపీ సర్కార్ సాహో చిత్ర అదనపు షోలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రధాన నగరాలలో సాహో చిత్రాన్ని తొలి వారం 6 షోలు ప్రదర్శించనున్నారు. శుక్రవారం అర్థరాత్రి 1 గంట నుంచి లేదా తెల్లవారుజాము నుంచి సాహో ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయి. 

ఇవి కూడా చదవండి : 

సాహో: బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతంటే?

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సచిన్ ని ఉదాహరణగా చెప్పి తన గౌరవం పెంచుకున్న ప్రభాస్!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

అందుకే నాలుగు సినిమాలు ఢమాల్.. ఫ్లాప్స్ పై ప్రభాస్!

‘సాహో’ఫస్ట్ టార్గెట్ ఆ తెలుగు డైరక్టర్ సినిమానే?

హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్

'సాహో' ప్రీరిలీజ్ టాక్.. మాస్ కి ఎక్కదా..?

‘సాహో’ సక్సెస్ అయితేనే...తేల్చి చెప్పిన ప్రభాస్!

బాహుబలి నా ముందు మోకాళ్లపై కూర్చున్నాడు.. సాహో విలన్!

Follow Us:
Download App:
  • android
  • ios