Asianet News TeluguAsianet News Telugu

'సాహో' డిజిటల్ రైట్స్.. అమెజాన్ భారీ ఆఫర్!

'సాహో' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ అమౌంట్ ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషలకు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మొత్తం రూ.40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అమెజాన్ సంస్థ ముందుకొచ్చిందట. అయితే దీనికి చిత్రబృందం అంగీకరించిందా..? లేదా..? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 

Saaho Digital Rights: Record Deal?
Author
Hyderabad, First Published Aug 23, 2019, 1:23 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’.  ఆగ‌ష్టు 30న భారీఎత్తున  ప్రపంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడం కోసం బయ్యర్ల మధ్య కాంపిటిషన్ ఓ రేంజ్ లో జరిగింది. భారీ అమౌంట్ కోట్ చేసిన వారికే రైట్స్ దక్కాయి. ఆ డీల్ క్లోజ్ అవ్వడంతో ఇప్పుడు శాటిలైట్ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పోటీ నెలకొంది.

హిందీలో ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం పేరున్న ఛానెల్స్ ప్రయత్నించగా.. ఫైనల్ గా టీసిరీస్ సంస్థ మొత్తం రైట్స్ ని దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ అమౌంట్ ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ, మలయాళ భాషలకు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మొత్తం రూ.40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అమెజాన్ సంస్థ ముందుకొచ్చిందట. అయితే దీనికి చిత్రబృందం అంగీకరించిందా..? లేదా..? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇది మంచి డీల్ అనే చెప్పాలి. సౌత్ డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడవ్వడమంటే మామూలు విషయం కాదు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios