యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. భారీ చిత్రాల విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఉమైర్ సంధు.. 'సాహో' రివ్యూ కూడా ఇచ్చేశారు.

యూఏఈలో ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుందని, అద్భుతంగా ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో వరుసగా ట్వీట్లు పెట్టారు. 'సాహో' ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ అని.. ప్రభాస్ ఎంట్రీ పైసా వసూల్ అని చెప్పారు. యాక్షన్ స్టంట్స్, చేజింగ్ సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

సినిమాలో ప్రభాస్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేమని ప్రభాస్ పై ప్రశంసల జల్లు కురిపించారు. 'సాహో' సాలిడ్ ఎంటర్టైనర్ అని వెల్లడించాడు. యాటిట్యూడ్, స్టార్ పవర్ కలిపి అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని.. ఈ సినిమా గత చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేస్తుందని, కొత్త రికార్డులను సృష్టిస్తుందని అన్నారు. 

 

 

 

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

‘సాహో’ టాక్.. ఆ మైనస్ లు ఉన్నా అదుర్స్

సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

'సాహో' డిజిటల్ రైట్స్.. అమెజాన్ భారీ ఆఫర్!