ప్రస్తుతం ఎక్కడ చూసినా 'సాహో' మేనియానే కనిపిస్తోంది. ఆగస్ట్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు రాత్రి చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా మిలియన్ మార్క్ టచ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. ప్రీమియర్ షోలు తెలుగు వెర్షన్ కి 25 డాలర్లు, హిందీ తమిళ వెర్షన్ లకు 20 డాలర్ల చొప్పున ఫిక్స్ చేశారు. తీరా బుకింగ్స్ చూస్తుంటే ఆశించిన స్థాయిలో లేవు. ఈ మధ్యకాలంలో సరైన సినిమాలు లేక అమెరికాలో సినిమా టికెట్ ధరలు బాగా తగ్గాయి.

12 డాలర్లకు మించి ఉండడం లేదు. మరీ స్టార్ హీరో సినిమా అంటే మరో ఐదు డాలర్లు అదనంగా పెడుతున్నారు. అలా చూసుకున్నా టికెట్ ధరలు 20 డాలర్ల లోపలే ఉంటున్నాయి. కానీ 'సాహో' విషయంలో అలా జరగలేదు. టికెట్ రేట్లు బాగా పెంచేశారు. దీంతో ఇప్పటివరకు ప్రీమియర్ షోలకు హాఫ్ మిలియన్ కలెక్షన్స్ కూడా రాలేదు.

పోనీ రేట్ ఏమైనా తగ్గిద్దామంటే నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని ఆలోచిస్తున్నారు. రెండు రోజులు చూసి తగ్గించినా.. అప్పటికి పెద్ద ఉపయోగం ఉండదు. అప్పటికి సినిమా ఆన్లైన్ లోకి వచ్చినా వచ్చేయొచ్చు. ముందే టికెట్ కి 15 డాలర్లు ఫిక్స్ చేసి ఉంటే బెటర్ గా ఉండేదని ట్రేడ్ టాక్. మరేం జరుగుతుందో చూడాలి!