ప్రభాస్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ సాహో. ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ మళయాళం భాషల్లో ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే నార్త్ స్టేట్ లో చాలా మంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక పంజాబ్ రాష్ట్రంలో కూడా ప్రభాస్ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. సాధారణంగా సౌత్ సినిమాలు పంజాబ్ లో అంతగా రిలీజ్ కావు. కానీ సాహో హిందీ ఫిల్మ్ ఒక బాలీవుడ్ స్టార్ హీరో రేంజ్ లో అక్కడ అంచనాలను రేపుతోంది. దాదాపు పంజాబ్ లోని అన్ని ఏరియాల్లో సాహో విడుదల కాబోతోంది. 

ఇంతకుముందు ప్రభాస్ బాహుబలి సినిమా అక్కడ భారీ స్థాయిలో రిలీజయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో యువీ క్రియేషన్స్ అక్కడ కూడా స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సారి ప్రభాస్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ నిర్మాతలు 300కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.