ప్రభాస్ నటించిన సాహో చిత్రం అత్యంత భారీ అంచనాల నడుమ ఆగష్టు 30న విడుదల కాబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం విడుదల కానుండడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. 

మహబూబ్ నగర్ లో తిరుమల థియేటర్ వద్ద సాహో బ్యానర్ కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. థియేటర్ లో బ్యానర్ కడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో కిందపడిపోయాడు.గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. క్రింది ఫొటోలో రెడ్ మార్క్ ఉన్న వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. 

ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించిన చిత్రం విడుదలయ్యే సమయంలో థియేటర్స్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. గతంలో తొక్కిసలాట వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమ అభిమాన హీరో కోసం ప్రేక్షకులు థియేటర్స్ వద్ద కటౌట్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూస్తూనే ఉన్నాం.