ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచవ్యాప్తంగా భారీ స్దాయిలోథియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందని భావిస్తున్నారు. ఇంకా ఒక్క షో కూడా పడకుండా రికార్డుల వేట మొదలెట్టింది ఈ సినిమా. బుకింగ్స్ లో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రికార్డ్ స్థాయిలో టికెట్లు  అమ్ముడవుతున్నాయి.

చాలా థియేటర్లకు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. తెలుగులో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనిపిస్తోంది. ఇక తమిళంలో భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఒక్క తమిళనాడులో ఈ చిత్రాన్ని 550 స్క్రీన్స్‌లో భారీగా విడుదల చేస్తున్నారు. 

'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమాను తమిళంలో మొత్తం 525 స్క్రీన్ లలో ప్రదర్శిస్తే.. ఇప్పుడు ఆ రికార్డ్ ని 'సాహో' బ్రేక్ చేసింది. విడుదలకు ముందే తమిళంలో రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. ఈ సినిమా రిలీజ్ కి ఒక్కరోజుకి మాత్రమే ఉండడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. భారీ కటౌట్స్ తో థియేటర్స్ ని  అలంకరిస్తున్నారు.