ప్రభాస్ హీరోగా నటించిన  తాజా చిత్రం‘సాహో’. ఈ శుక్రవారమే  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టికెట్ రేట్స్ పెంచుకోవడంతో పాటు స్పెషల్ బెనిఫిట్ షోస్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే సమస్య తెచ్చిపెట్టింది.

ఇలా ఇష్టమొచ్చినట్టు పెద్ద సినిమాల వాళ్లు  టికెట్ రేట్లు పెంచడంపై తెలుగు సినీ  నిర్మాత నట్టికుమార్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ‘సాహో’ సినిమాను చూడాలకునుకొనే ప్రేక్షకులను వీక్‌నెస్‌ను చిత్ర నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సినిమా టికెట్ రేటును రూ.300 వరకు పెంచారని ఆయన అన్నారు. తక్షణమే వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని నట్టికుమార్ పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ విషయమై స్పందించిన న్యాయస్థానం ‘సాహో’చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ హోమ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, విశాఖ పోలీస్ కమిషనర్, సాహో చిత్ర పంపిణిదారు దిల్‌రాజు తదితరులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ ఈ రోజు కొనసాగనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘సాహో’చిత్రానికి స్పెషల్ పర్మిషన్ షోస్‌తో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు.