‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?
సాహో ఓవర్‌సీస్ రైట్స్‌ని దుబాయ్‌కి చెందిన ఫార్స్ అనే సంస్థ 42 కోట్ల రూపాయలు పెట్టి తీసుకొంది. తమ కు అమెరికాలో నెట్ వర్క్ లేకపోవటంతో ఈ సినిమాని యష్‌రాజ్ సంస్థ ద్వారా విడుదల చేస్తోంది.

‘బాహుబలి’ సిరీస్ తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’.దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను.... ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీస్థాయిలో విడుదలవుతోంది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం మొదట షో ఎక్కడ పడుతుంది..టాక్ ఏమి వస్తుందనేది అంతటా ఆసక్తికరమైన విషయంగా మారింది. ఈ విషయమై రకరకాల టాక్ లు వచ్చినా మొత్తానికి క్లారిటీ వచ్చింది.
సాహో ఓవర్‌సీస్ రైట్స్‌ని దుబాయ్‌కి చెందిన ఫార్స్ అనే సంస్థ 42 కోట్ల రూపాయలు పెట్టి తీసుకొంది. తమ కు అమెరికాలో నెట్ వర్క్ లేకపోవటంతో ఈ సినిమాని యష్‌రాజ్ సంస్థ ద్వారా విడుదల చేస్తోంది. దుబాయ్‌కి చెందిన సంస్థే కొనటంతో దుబాయ్‌లో మొదట షో వేస్తున్నారు. అంటే ఇండియన్ టైమ్ ప్రకారం రేపు రాత్రి 10 గంటలకి దుబాయ్‌లో మొదటి షో పడుతుంది.
అమెరికాలో భారత కాలమానం ప్రకారం రేపు అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్ షోలు మొదలవుతాయి. ఇక ఇండియాలో మొదటి షో...శుక్రవారం తెల్లవారుఝామున మొదటి ఆట పడుతుంది. రేపు దుబాయ్‌లో షో పూర్తి కాగానే... రిజల్ట్ ఏంటనేది తేలనుంది.