సాహో’ సినిమా కోసం కేవలం తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేచి చూస్తోంది. దానికి కారణం బాహుబలితో ప్రభాస్ కు  వచ్చిన ఇమేజ్, హైప్.  ఇప్పటికే  విడుదలైన సాహో పోస్టర్స్, ట్రైలర్స్ ,సాంగ్స్ కూడా సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని  పెంచేసాయి. బాలీవుడ్ సినిమా సైతం షాక్ అయ్యేలా ఉన్న విజువల్స్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లిపోయాయి. దానికి తోడు సాహో కోసం ప్రభాస్ కూడా తెగ కష్టపడుతున్నాడు. షూటింగ్ లో డేర్ డెవిల్ ఫైట్స్ చేయటమే కాక,  ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నాడు.  ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉండ‌బోతోంది?  అనే విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో ఉన్న టాక్ ఏమిటి...అనేది   అందిస్తున్నాం. 

అందుతున్న సమాచారం ప్రకారం  ఈ సినిమా మొదటి నుంచీ చెప్పుకుంటున్నట్లుగానే స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్ ...హాలీవుడ్ హీరోలకు సైతం కుళ్లుకునేలా ఉందని , ఇండియాలో ఏ భాషలోనూ  రానటువిధంగా వరల్డ్ క్లాస్ యాక్షన్ సీన్స్ , విజువల్ గా రిచ్ గా ఉండటం కలిసొచ్చే అంశం అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా డార్లింగ్ కనపడతాడని తెలుస్తోంది.  

అయితే  అదే సమయంలో కొన్ని మైనస్ లు ఉన్నాయని చెప్తున్నారు. సినిమాలో స్టైల్స్ కి ఇచ్చినంత  ప్రయారిటీ కంటెంట్ కు ఇవ్వలేదని చెప్తున్నారు.  ప్రభాస్ స్దాయికి తగ్గ  క‌థ లేదంటున్నారు. స్క్రీన్ ప్లే సైతం అంతంత మాత్రంగానే ఉందని, స్టైల్ సినిమాని డామినేషన్ ని చెప్తున్నారు. ఫన్ కు అయితే ప్లేసే లేదట. ఇక లీడ్ పెయిర్ శ్రద్ద, ప్రభాస్ మధ్య జరిగే లవ్ స్టోరీ ప్లాట్ గా ఉండటం, కుప్పలు తెప్పలుగా విలన్స్ ఉండటంతో కన్ఫూజన్ రావటం జరిగిందని చెప్తున్నారు. క్లైమాక్స్ కూడా సోసోగా ఉందిట. మూడు గంటల సినిమాలో యాక్షన్ సీన్స్ కు ఇచ్చిన ప్రయారిటీ ఎమోషన్స్ కు ఇవ్వలేదని చెప్తున్నారు.
 
ఇవన్నీ బేరీజు వేస్తే ప్రభాస్ హవా ముందు మిగతా వన్నీ దిగదుడిపే. కేజీఎఫ్ సినిమాకు సైతం ఇలా విలన్స్ ఎక్కువ మంది, ఓవర్ స్టైలిష్ అన్నారు. కానీ అది ప్రభంజనంలా రికార్డ్ లు క్రియేట్ చేసింది. అలాంటి మ్యాజికే ఈ సినిమా విషయంలోనూ జరిగే అవకాసం ఉంది.  ఇక వీటిల్లో ఎంతవరకూ నిజం ఉందనేది కూడా రిలీజ్ దాకా తెలియదు. అప్పటివరకూ వీటిని కేవలం రూమర్స్  క్రిందే తీసుకోవాలి.