ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ గురించి తెలియనిదెవరకి. ఆయన దర్శకత్వంలో నటించాలని హీరోలంతా ఉవ్విళ్లూరతారు. అయితే ఆయనకు కూడా క్రేజ్ లో ఉన్న హీరోలతో మాత్రమే చెయ్యాలని ఉంటుంది. అది సహజం కూడా. ప్రస్తుతం కమల్ తో ఇండియన్ 2 చిత్రం తెరకెక్కిస్తున్న ఆయన దృష్ణి ప్రభాస్ పై పడిందిట.

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ గురించి తెలియనిదెవరకి. ఆయన దర్శకత్వంలో నటించాలని హీరోలంతా ఉవ్విళ్లూరతారు. అయితే ఆయనకు కూడా క్రేజ్ లో ఉన్న హీరోలతో మాత్రమే చెయ్యాలని ఉంటుంది. అది సహజం కూడా. ప్రస్తుతం కమల్ తో ఇండియన్ 2 చిత్రం తెరకెక్కిస్తున్న ఆయన దృష్ణి ప్రభాస్ పై పడిందిట. దాంతో ఆయన వేరే ప్రొడక్షన్ కంపెనీతో కలిసి ప్రభాస్ తో సినిమా చేయటం కోసం డిస్కషన్స్ మొదలెట్టారట.
సాహో రిలీజ్ అయ్యిన వెంటనే ప్రభాస్ ని కలిసి కథ చెప్పాలని ప్రిపేర్ అవుతున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న లైకా ప్రొడక్షన్స్ వారికి మాత్రం మండుకొస్తోందిట. తమ సినిమాపై కాన్సర్టేట్ చేయకుండా తన తదుపరి చిత్రం కోసం డిస్కషన్స్ మొదలెట్టడమేంటని వారి వాదనట. అయితే శంకర్ వాటిని అన్నటినీ కొట్టిపారేస్తున్నారట. తాను ఏ సినిమా చేసినా తన తదుపరి ప్రాజెక్టు కోసం ఇలా డిస్కస్ చేస్తూంటాను అని, ఇందులో తప్పేమి లేదని అందరూ చేసే పని ఇదేనని అంటున్నారుట. అలా ప్రభాస్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ కు, శంకర్ కు మధ్య బేధాభిప్రాయాలు వస్తున్నాయట.
ఇక ఇండియన్ 2 విషయానికి వస్తే..లోక నాయకుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.