యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. సాహో చిత్రం ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. సినిమా బావుంటే ఇండియన్ స్క్రీన్ పై టాప్ చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. 

సాహో చిత్రంపై హిందీ మార్కెట్ లో ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయం భిన్నంగా ఉంది. సాహో చిత్రం బాహుబలి 2 రికార్డులని హిందీలో అధికమిస్తుందనే అంచనాలతో ట్రేడ్ అనలిస్టులు విభేదిస్తున్నారు. బాహుబలి 2 కేవలం హిందీలోనే 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

బాహుబలి చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆ చిత్రం కోసం నార్త్ లో క్యూ కట్టారు. కానీ సాహో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూసే యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా కాదు. ఈ చిత్రం కోసం ఎక్కువగా యువత మాత్రమే ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు. 

సాహో చిత్రంలో కంటెంట్ అద్భుతంగగా ఉంటె బాహుబలి స్థాయి వసూళ్లు నమోదు కావచ్చు. కానీ ప్రస్తుతానికి అంచనాలు ఆ స్థాయిలో లేవని హిందీ సినీ విశ్లేషకుల అభిప్రాయం.